అందుకే ఇప్పటి వరకు మహేష్ చిత్రాన్ని చూడలేదంటున్న ప్రకాష్ రాజ్...

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, ఇలా చిత్ర పరిశ్రమతో సంబంధం లేకుండా ఎన్నో పాత్రల్లో నటించినటువంటి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో బిజీబిజీగా రాణిస్తున్నాడు.

 Prakash Raj React About Mahesh Sarileru Neekevvaru Movie-TeluguStop.com

అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న వ్యక్తి మీకు మహేష్ బాబు కి మధ్య తగాదాలు ఉన్నాయని బయట పలు వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా అని అడిగాడు.

దీనిపై ప్రకాష్రాజ్ స్పందిస్తూ తనకు మహేష్ బాబు కి మధ్య ఎటువంటి తగాదాలు లేవని, అంతేగాక మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు.అంతేగాక ఈ మధ్య కాలంలో మహేష్ బాబుతో తాను నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కూడా ఇంతవరకు చూడలేదని అన్నారు.

Telugu Prakash Raj, Prakashraj-Movie

అయితే అందుకు కారణం చెబుతూ తాను నటించినటువంటి చిత్రాలు పెద్దగా చూడనని అందువల్లనే ఇప్పటివరకు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చూడలేదని అన్నారు.అయితే మరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి ఎందుకు హాజరు కాలేదని యాంకర్ అడగ్గా తాను నటించిన చిత్రాల ఆడియో ఈవెంట్లకి,  ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఇప్పటివరకు అటెండ్ కాలేదని తనకు పెద్దగా ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube