ఆ సినిమా కోసం భారీ గా బరువు తగ్గానంటున్న రానా

దగ్గుబాటి హీరో రానా అడ్వెంచర్ డ్రామా అరణ్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణం లో ప్రభు సాల్మన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం హీరో రానా భారీ గా తన బరువును తగ్గించుకున్నట్లు తెలిపారు.

 Hero Rana Huge Weight Loss For The Aranya Movie Making-TeluguStop.com

మొత్తం మూడు భాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విశేషాలను రానా వెల్లడించారు.యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన పోస్టర్లు,టీజర్ లను గమనిస్తే ఆ విషయం ఇట్టే అర్ధం అవుపోతుంది.అరణ్య చిత్రంలో రానా బాణదేవ్ అనే ఒక అడవి మనిషి పాత్రలో అలరించనున్నాడు.

అయితే ఈ పాత్రకోసం చాలా కఠినమైన ఆహార నియమాలు పాటించడం తో పాటు కఠిన శిక్షణ తో దాదాపు 30 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తుంది.డైరెక్టర్ ప్రభు సాల్మన్ రానా పాత్రకు సంబంధించి ప్రతిదీ వాస్తవికంగా, సహజంగా ఉండాలని భావించారట.

అందుకే ఎప్పుడూ భారీకాయంతో, దృఢంగా ఉండాలనుకొనే రానా ఈ చిత్రం కోసం ఈ స్థాయిలో బరువుతగ్గానని రానా తెలిపారు.బాణదేవ్ క్యారెక్టర్ కోసం సన్నగా మారడానికి తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా, అది నాకొక వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ అని రానా తెలిపారు.

‘అరణ్య’ చిత్రం ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు అక్రమంగా కబ్జా చేసిన దురదృష్టకర ఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించారు.

ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా కనిపించబోతున్నారు.

ఈ చిత్రం కోసం బాగా బరువు తగ్గిన రానా సన్నగా,బాగా పెరిగిన గడ్డం,గ్రే హెయిర్,పైకి వంచిన భుజం తో కనిపించనున్నారు.

మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ ‘అరణ్య’ కాగా, తమిళ వెర్షన్ ‘కాడన్’లో రానాతో పాటు తమిళ నటుడు విష్ణు విశాల్ నటించారు.ఇక హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’లో పుల్కిత్ సామ్రాట్ నటించారు.

మరో రెండు కీలక పాత్రలను శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ పోషించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube