నిర్భయ దోషుల ఉరి అమలుపై కేంద్రం మరో పిటీషన్,మార్చి 5 కు వాయిదా

ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసు లో దోషులకు 7 ఏళ్ల తరువాత శిక్షలు ఖరారు చేసింది ఢిల్లీ లోని పాటియాలా కోర్టు.

 Another Petition To The Center On The Execution Of Nirbhaya Convicts Adjourned-TeluguStop.com

అయితే గత కొద్దీ రోజులుగా వీరి శిక్షలపై సందిగ్ధత వ్యక్తం అవుతూనే ఉంది.ఎప్పుడు వారికి ఉరిశిక్షలు అమలు చేస్తారా అని అటు నిర్భయ కుటుంబం తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తూనే ఉన్నారు.

కానీ నిర్భయ దోషులు మాత్రం ఎప్పటికప్పుడు తప్పించుకొనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.అయితే రెండు సార్లు వాయిదా పడ్డ వారి ఉరిశిక్షలను మార్చి 3 వ తేదీన అమలు పరచాలి అంటూ ఇటీవల ఢిల్లీ పాటియాలా కోర్టు మరోసారి తీర్పు వెల్లడించింది కూడా.

అయితే ఇప్పుడు వారి ఉరిశిక్షల అమలు లో మరో ట్విస్ట్ నెలకొన్నట్లు కనిపిస్తుంది.ఈ కేసులో దోషులుగా ఉన్న నలుగురికి వేర్వేరుగా ఉరిశిక్ష ఉరిశిక్ష అమలు చేసేలా అనుతి ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ అధికారులు సుప్రీంను ఆశ్రయించగా, ఈ కేసు తదుపరి విచారణ ను మార్చి 5వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

దీంతో, ఉరిశిక్ష అమలు మరోసారి నిలిచిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే నిర్భయ కేసుకు సంబంధించి దోషులుగా ఉన్న పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ రాథోడ్, ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయడానికి గతంలో తీర్పు వెల్లడించినప్పటికీ రెండు సార్లు వారి డెత్ వారెంట్ లు వాయిదా పడ్డాయి.

అయితే సుప్రీం కోర్టు కూడా వారి ఉరిశిక్షల అమలు విషయంలో ఢిల్లీ పాటియాల కోర్టు కే వదిలివేయడం తో ఇటీవల మరోసారి పాటియాలా కోర్టు మార్చి 3 వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో నలుగురికి ఒకేసారి ఉరిశిక్షలు అమలు చేయాలి అంటూ తీర్పు వెల్లడించింది.

Telugu Delhi Patiyala, Nirbhaya Delhi, Nirbhaya Pone, Nirbhayavictims, Supreme,

అయితే ఇప్పటికైనా వారికి శిక్షలు అమలు కాబడతాయి అని అందరూ భావించగా ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు లో చోటుచేసుకున్న పరిణామాలతో మరోసారి వారి ఉరిశిక్షల అమలుపై సందిగ్ధత మొదలైంది.మరి ఈ మార్చి 3 న అయినా వారి ఉరిశిక్షలు అమలు అవుతాయా లేదంటే కేంద్రం వేసిన పిటీషన్ నేపథ్యంలో శిక్షలు మరోసారి రద్దు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube