ఇవాంక కి ప్రత్యేక బహుమతి తో ఢిల్లీ కి పయనమైన సీఎం

భారత పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబం తో కలిసి సోమవారం అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో దిగిన సంగతి తెలిసిందే.ట్రంప్ కి ప్రధాని నరేంద్రమోడీ రెడ్ కార్పెట్ తో ఘనంగా ఆహ్వానం పలికారు.

 Kcr Will Be Heading To Delhi For Meet The Trump Family-TeluguStop.com

అయితే ట్రంప్ ప్రత్యేక సలహాదారు అయిన ఇవాంక కూడా రావడం తో తెలంగాణా సీఎం కేసీఆర్ ఆమెకు ప్రత్యేక బహుమతి తీసుకొని ఢిల్లీ కి పయనమవ్వనున్నట్లు తెలుస్తుంది.సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందడం తో ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానం లో ఢిల్లీ కి పయనమయ్యారు.ఈ విందులో మొత్తంగా 90 నుంచి 95 వీఐపీలు మాత్రమే పాల్గొననున్నట్టు సమాచారం.

వీరిలో వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు ఉన్నారు.ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్నాటక, అసోం, హరియాణా, బిహార్‌ ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తుంది.

కాగా, ట్రంప్‌తో పాటు మెలానియా, ఇవాంకకు కూడా కేసీఆర్ ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటో అందించనున్నారు.

మెలానియా, ఇవాంకకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోచంపల్లి, గద్వాల్ చీరలను సీఎం బహూకరించనున్నట్లు సమాచారం.ఈ రోజు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రేపు హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు తెలుస్తుంది.

Telugu Delhi, Donald Trump, Gadwal, Gift, India, Ivanka Trump, Kcrdelhi, Telanga

అయితే మరో విశేషం ఏమిటంటే రాష్ట్రపతి ఇచ్చే విందులో తెలంగాణా వంటకాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది.2017 లో ఇవాంక ఒక సమ్మిట్ లో భాగంగా తెలంగాణా వచ్చిన విషయం తెలిసిందే.ఆ సమయంలో ఏర్పడిన పరిచయం తోనే కేసీఆర్ ఇవాంక,మొలనియా లకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube