పవన్ సినిమా ఆ టైపు కాదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

 Pawan Kalyan Movie Will Not Be An Art Film-TeluguStop.com

కాగా ఈ సినిమాలో పవన్ ఓ లాయర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.కాగా బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్ కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి.

అయితే పింక్ సినిమాలో ఎలాంటి యాక్షన్, మాస్ అంశాలు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాను ఎందుకు చేస్తున్నాడా అని అందరూ అనుకున్నారు.పింక్ మూవీ ఓ ఆర్ట్ సినిమాలా ఉండటంతో పవన్‌కు ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో పవన్ ఇమేజ్‌కు సరిపోయేలా యాక్షన్ సీక్వెన్సులను పెట్టినట్లు, అదే విధంగా థమన్ కూడా అదిరిపోయే మాస్ బీట్ సాంగ్స్‌ను అందిస్తుండటంతో ఈ సినిమా మాస్ వర్గాలను అలరించడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube