కమెడియన్ కి విలన్ గా మరో కమెడియన్ 

టాలీవుడ్లోకి మొదటగా కమీడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో హీరోగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న టువంటి నటుడు సునీల్ గురించి టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే తాజాగా హీరో మరియు కమెడియన్ సునీల్ “కలర్ ఫోటో” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

 Sunil Got A Chance To Play Villain Role In Color Photo Movie-TeluguStop.com

ఈ చిత్రంలో సునీల్ హీరోగా కాకుండా విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ చిత్రంలో హీరోగా నాగచైతన్య, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ దేవ్, తదితర హీరోల చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తూ కామెడీ పండించినటువంటి కమెడియన్ సుహాస్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి నూతన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Telugu Color, Sunil Color, Sunil Latest, Sunil, Tollywood-Movie

అంతేగాక ఇటీవల కాలంలో చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసినటువంటి ఈ చిత్ర పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది.ప్రస్తుతం ఈ చిత్రం హైదరా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం సునీల్ కి సంబంధించినటువంటి సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా  సునీల్ ఇటీవల కాలంలో విలన్ గా నటించినటువంటి డిస్కో రాజా చిత్రం ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.కానీ సునీల్ కి మాత్రం ఈ చిత్రం బాగానే కలిసొచ్చింది.

ప్రస్తుతం సునీల్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో కూడా విలన్ గా నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో లో నందమూరి లెజెండ్ బాలయ్య బాబు హీరోగా నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube