ఆ విషయంలో థాక్రే ను హెచ్చరించిన ఎస్పీ పార్టీ నేత

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కు సమాజ్ వాదీ పార్టీ నేత అబు అజ్మీ హెచ్చరికలు జారీ చేశారు.సీఏఏ,ఎన్పీఆర్,ఎన్నార్సీ లపై వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు.

 Maharashtra Sp Leader Abu Azmi Warns Cm Thackeray Over Implementation Of Npr Ca-TeluguStop.com

కేరళ,పశ్చిమ బెంగాల్ లో వాటికి వ్యతిరేకంగా అసెంబ్లీ లో ఎలా తీర్మానం చేశారో అలానే థాక్రే వ్యవహరించాలి అంటూ ఆయన సూచించారు.అంతేకాకుండా ఈ చట్టాలు ముస్లింలను సమస్యల్లోకి నెడుతాయని సెన్సస్ మాదిరి ఎన్పీఆర్ ను కూడా మహారాష్ట్రలో చేపట్టాలనుకుంటే మాత్రం ఊరుకోమని, తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాం అంటూ ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే ముందుగానే ముఖ్యమంత్రికి ఈ విన్నపం చేస్తున్నామని,వినకపోతే రాబోయే రోజుల్లో వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు.మరోవైపు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల పై శివసేన ప్రవర్తిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుబడుతోంది.

ప్ర

ధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే నిన్న భేటీ అయి, మహారాష్ట్రలో కూడా సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల ను అమలు చేయాలనీ థాక్రే ను కోరింది.ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం లో బీటలు మొదలయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube