తెలుగు వారికే బాలయ్య ఓటు.. పాపం సీనియర్‌లు!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలవ్వలేదు.

 Balakrishna Wants New Telugu Actress For His Movie-TeluguStop.com

దీంతో ఈ చిత్రం సెట్స్‌పైకి ఎప్పుడెప్పుడు వెళుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది.

గతంలో బోయపాటికి మాతృవియోగం కలగడంతో ఈ సినిమా వాయిదా పడగా, ఇప్పుడు బాలయ్యకు సరైన హీరోయిన్ దొరకకపోవడంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతోందని చిత్ర యూనిట్ అంటోంది.ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ విషయంలో బాలీవుడ్ బ్యూటీల దగ్గర నుండి తాజాగా సీనియర్ బ్యూటీ శ్రియా, నయనతారల వరకు అందరి పేర్లు వినిపించాయి.

కానీ వారెవ్వరినీ ఓకే చేయలేదు చిత్ర యూనిట్.

ఇక బాలయ్య మాత్రం తనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నాడట.

దీని కోసమే చిత్ర యూనిట్ వెతుకులాట మొదలుపెట్టారు.బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ తెలుగు బ్యూటీ ఎవరా అనేది తెలియాల్సి ఉంది.

మిర్యాల రవిందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను మార్చి నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube