చిరు 152లో మహేష్‌ వార్తలపై ఆయన ఇలా అన్నాడు

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నట్లుగా చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా క్రేజ్‌ను పెంచేందుకు ప్రముఖ స్టార్‌ హీరో మహేష్‌బాబును ఈ చిత్రంలో నటింపజేయాలని కొరటాల శివ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

 Mahesh Babu Pro Give The Clarity About Mahesh Babu Act In Chiranjeevi 152 Movie-TeluguStop.com

మహేష్‌బాబు, కొరటాల శివల మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆ కారణంగానే మెగా మూవీలో మహేష్‌ నటించేందుకు ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

Telugu Koratalasiva, Mahesh Babu, Maheshbabu, Mahesh Babu Pro-Movie

ఈ వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.మెగా మూవీలో మహేష్‌ నటించడం చాలా గొప్ప విషయం అని అంతా అనుకుంటున్నారు.అయితే ఈ సమయంలో మహేష్‌బాబు పీఆర్‌ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.అసలు అలాంటి ప్రతిపాధనే లేదు అంటూ ఆయన ప్రకటించాడు.కొరటాల శివతో మహేష్‌బాబుకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న మాట వాస్తవమే.కాని ఆ సినిమాలో నటించమని మహేష్‌ను కొరటాల కోరలేదు అన్నాడు.

Telugu Koratalasiva, Mahesh Babu, Maheshbabu, Mahesh Babu Pro-Movie

దీంతో గత రెండు రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.ఈమద్య కాలంలో స్టార్‌ హీరోలు ఒకరి సినిమాల్లో ఒకరు గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చుకోవడం కామన్‌ అయ్యింది.అందుకే ఈ సినిమాలో మహేష్‌ ఉంటే బాగుంటుందని, ఇప్పటి వరకు ఆలోచించకున్నా కొరటాల ఇప్పటికైనా ఆలోచించి మహేష్‌ను చిరు మూవీలో పెట్టాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు.మరి కొరటాలకు ఇది అర్థం అవుతుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube