‘భీష్మ’ పబ్లిక్‌ స్పందన ఏంటో తెలుసా?

నితిన్‌ హీరోగా రష్మిక హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు రివ్యూవర్స్‌ పాజిటివ్‌ రెస్పాన్స్‌ ఇచ్చారు.

 Bheeshma Public Responce-TeluguStop.com

సరాసరిగా చూసుకుంటే ఈ సినిమాకు మూడు రేటింగ్‌ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రాన్ని చూసి బయటకు వస్తున్న ప్రేక్షకుల రెస్పాన్స్‌ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయగా వారు కూడా చాలా సంతృప్తిగా బయటకు వస్తున్నారు.

Telugu Bheeshma, Bheeshma Day, Bheeshma Latest, Bheeshma Public, Nithinbheeshma,

సినిమా విషయంలో ప్రేక్షకులు ఈమద్య ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకుంటున్నారు.అది ఈ సినిమాలో చాలానే ఉందంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నితిన్‌ నుండి సినిమా అంటే ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తారో అదే ఈ సినిమాలో ఉండంటూ వారు చెబుతున్నారు.రష్మిక మరియు నితిన్‌ల మద్య రొమాన్స్‌ చాలా బాగుందని, ఇక వెన్నెల కిషోర్‌ కామెడీతో సినిమాకు మరింత బలం చేకూరిందన్నారు.

సినిమా కథ కూడా ఇంట్రెస్టింగ్‌ గా ఉందంటున్నారు.

Telugu Bheeshma, Bheeshma Day, Bheeshma Latest, Bheeshma Public, Nithinbheeshma,

నితిన్‌, రష్మికల మందనలు ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తే చూడాలనుకుంటున్నట్లుగా ప్రేక్షకులు భావిస్తున్నారు.ఇక కొందరు నితిన్‌ చాలా సంవత్సరాల తర్వాత మంచి సినిమా చేశాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.మల్టీప్లెక్స్‌తో పాటు అన్ని చోట్ల కూడా సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube