మహారాష్ట్రలో కూడా దిశ చట్టం! త్వరలో మార్గదర్శకాలు

హైదరాబాద్ లో అత్యాచారం చేసి హత్య చేయబడ్డ దిశ సంఘటనపై కలత చెందిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంధ్రప్రదేశ్ అలాంటి ఘటనలు జరిగితే వెంటనే నిందితులకి శిక్ష పడేలా చట్టంలో మార్పులు చేసి దిశ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు.దీనికోసం ఒక యాప్ ని కూడా రూపొందించారు.

 Mahastra Government Like To Implement Disha Act-TeluguStop.com

ఈ యాప్ ద్వారా ఎక్కడైనా వేధింపులకి గురయ్యే మగువలు ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు కేసు ఫైల్ చేసి విచారణ కూడా 21 రోజుల్లో పూర్తి చేసి నేరం రుజువైన నిందితుడుకి నేరం స్థాయి బట్టి ఉరిశిక్ష వరకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు.

ముఖ్యమంత్రి జగన్ ఈ కేసులలో విచారణ వేగవంతం చేయడానికి ఏకంగా దిశ పోలీస్ స్టేషన్ లు కూడా ప్రారంభించి ఈ చట్టాన్నిలో అమల్లోకి తీసుకొచ్చారు.

ఇక జగన్ తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు.ఢిల్లీ లో కేజ్రీవాల్ సర్కార్ ఈ చట్టాన్ని అక్కడ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి ముఖ్యమంత్రి జగన్ ని కలిసి దిశ బిల్లుపై చర్చించారు.ఈ సందర్భంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన ప్రశంసలు కురిపించడంతో పాటు మహారాష్ట్రలో కూడా ఈ దిశ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube