రష్మిక ఫోటో కి హాట్ కామెంట్ చేసిన కలెక్టర్...

సాధారణంగా సెలబ్రిటీలు చుట్టూ సోషల్ మీడియా 100 కళ్ళతో ని గా ఉంచుతుంది.ఇందులో భాగంగా ఏదైనా చిన్నపాటి తప్పు దొర్లినా వెంటనే సరిదిద్దుకోక పోతే నెటిజన్లు ఆ తప్పుని దారుణంగా ట్రోల్స్ చేస్తారు.

 Jagtial Collector Comment To Rashmika Mandanna Photos-TeluguStop.com

తాజాగా టాలీవుడ్ గ్లామర్ క్వీన్ రష్మిక మందన్న ఓ ప్రముఖ ఫోటోషూట్ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో భాగంగా తాను ఫోజ్ ఇచ్చినటువంటి ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో తన అభిమానులతో పంచుకుంది.

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తాజాగా ఈ ఫోటోలకి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కలెక్టర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫోటోలకి చించావ్ పో రష్మిక అంటూ కామెంట్ చేశారు.దీంతో ఈ విషయం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.

 అంతేకాక నెటిజన్లు కూడా ఈ విషయంపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇందులో ముఖ్యంగా బాధ్యత గల గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ఉద్యోగంలో ఉండి ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటని విమర్శలు కురిపిస్తున్నారు.

దీంతో ఈ విషయం ఈ నోటా ఆ నోటా పాకి  చివరికి జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి వరకూ వ్యాపించింది.విషయం తెలుసుకున్నటువంటి కలెక్టర్ అవి వెంటనే పోలీసులను సంప్రదించారు.

ఇందులో భాగంగా తన వ్యక్తిగత అధికారిక ట్విట్టర్ ఖాతా ను ఎవరో హ్యాక్ చేశారని ఫిర్యాదు నమోదు చేశారు.అంతేగాక తన ట్విట్టర్ ఖాతా అని తొలగించాల్సిందిగా ట్విట్టర్ అధికారులను కోరారు.

Telugu Jagtial Ravi, Tollywoodheroin-Latest News - Telugu

దీంతో ప్రస్తుతం ఈ విషయం పై నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.గవర్నమెంట్ ఉద్యోగి అయినటువంటి జిల్లా కలెక్టర్ఖాతానే హ్యాక్ కి గురయ్యైందంటే ఇక సామాన్యుల డేటా ఇంతకీ సేఫ్ గా ఉందో లేదో అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఈ విషయంపై కచ్చితంగా ట్విట్టర్ సంస్థ అధికారులు వివరణ ఇవ్వాలని లేకపోతే పలువురు తమ తమ ట్విట్టర్ ఖాతాలను డిలీట్ తొలగిస్తామని అంటున్నారు.అయితే మరి ట్విట్టర్ అధికారులు ఈ సంఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube