హ్యాట్సాఫ్‌ : ఇలాంటి మంచి మనసు ఎంత మందికి ఉంటుంది చెప్పండి

పిల్లలు ఉన్నా కూడా ఇతరుల పిల్లలను పెంచుకుంటూ తల్లిదండ్రులు లేని పిల్లలకు వారే తల్లిదండ్రులు అయిన వారి గురించి మనం ఇప్పటి వరకు చదువుకున్నా.చూశాం.

 Muslim Wife And Husband Gets Hindu Foster Daughter Married In Temple-TeluguStop.com

కాని ఈ తల్లిదండ్రులు కాస్త విభిన్నం.రాజేశ్వరి అనే అమ్మాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది.

బంధువులు ఎవరు కూడా ఈమెను పట్టించుకోలేదు.అనాధగా మారిన ఆ అమ్మాయిని తెలిసిన వారి ద్వారా ముస్లీం దంపతులు అయిన అబ్దుల్లా మరియు ఖదీజాలు ఆమెను పెంచుకునేందుకు తీసుకున్నారు.

Telugu Abdulla Khdija, Rajeswari, Muslims, Hindufoster-General-Telugu

అప్పటికే వారికి ముగ్గురు సంతానం ఉన్నారు.దిగువ మద్యతరగతి కుటుంబం అయినా కూడా ఆ పాప తమకు భారం కాదులే అనుకుని దేవుడు ఇచ్చిన మరో బిడ్డగా పెంచారు.అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటీ అంటే రాజేశ్వరి హిందూ కుటుంబంకు చెందిన అమ్మాయి.కనుక చిన్నతనం నుండి కూడ రాజేశ్వరిని హిందువుగానే పెంచారు.హిందువుల పండుగకు ఆమె వేడుక చేసుకునేలా చేశారు.అలాగే హిందువుల తరహాలోనే డ్రస్సింగ్‌ అయ్యేలా ఆ దంపతులు పూర్తి స్వేచ్చను ఇచ్చారు.

Telugu Abdulla Khdija, Rajeswari, Muslims, Hindufoster-General-Telugu

ఇచ పెళ్లిడుకు వచ్చిన రాజేశ్వరికి పెళ్లి చేసేందుకు ఆ ముస్లీం దంపతులకు కాస్త ఇబ్బంది అయ్యింది.ముస్లీంల ఇంట్లో పెరిగిన అమ్మాయి అవ్వడంతో రాజేశ్వరిని హిందు కుటుంబాలు అంగీకరించేందుకు ఆసక్తి చూపించలేదు.దాదాపుగా సంవత్సరం పాటు ఆ ముస్లీం దంపతులు ఎంతో మంది అబ్బాయిలను జాగ్రత్తగా పరిశీలించి, అమ్మాయికి అన్ని విధాలుగా నచ్చాడు అనుకున్న తర్వాత ఒక పెళ్లి పిక్స్‌ చేశారు.బాలచందర్‌ అనే కుర్రాడితో రాజశ్వేరి వివాహం తాజాగా అయ్యింది.

అయితే వీరి వివాహంకు ఒక దేవాలయం కావాల్సి వచ్చింది.

Telugu Abdulla Khdija, Rajeswari, Muslims, Hindufoster-General-Telugu

ఇండియాలో పలు దేవాలయాలకు ముస్లీంల అనుమతి లేదు.దాంతో వీరు పెళ్లి చేసేందుకు కూడా గుడి కోసం చాలా వెదికారు.చివరకు ఒక గుడిలో ముస్లీంలకు అనుమతించి రాజేశ్వరి, బాలచందర్‌ల వివాహంకు అనుమతించారు.

దాంతో సంతోషంగా ఆ కొత్త జంట పెళ్లి అయ్యింది.ఈ పెళ్లి తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఆ ముస్లీం దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇలాంటి మంచి మనసు ఎంత మందికి ఉంటుంది చెప్పండి అంటూ అంతా ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube