విడ్డూరం : నెలసరి రోజుల్లో ఆడవారు భర్తకు వండి పెడితే మరు జన్మలో వేశ్యగా పుడతారు, భర్త ఎద్దుగా పుడతారట

మనం ఇప్పుడు కంప్యూటర్‌ కాలంలో ఉన్నాం.మనుషులు సృష్టికి ప్రతి సృష్టి చేసి అద్బుతాలను ఆవిష్కరిస్తున్నారు.

 If Menstruating Women Cook They Will Be Born As Bitch In Next Life-TeluguStop.com

ఇలాంటి సమయంలో కూడా ఇంకా కొందరు నమ్ముతున్న మూడ నమ్మకాలు చూసి అంతా అవాక్కవుతున్నారు.ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ మూడ నమ్మకాలు దారుణంగా ఉన్నాయి.

మూడ నమ్మకాలను నమ్మే వారు ఇంకా ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయిదే ఇక్కడ దురదృష్టం ఏంటీ అంటే ఆ మూడ నమ్మకాలను ప్రచారం చేసేది సాదువులు, స్వామీజీలే.

Telugu Cook Born Bitch, Indian Womens, Krishnaswaroop, Swamy Yana Buj, Telugu Wi

తాజాగా స్వామి నారాయణ భుజ్‌ మందరి గురువర్యుడు కృష్ణస్వరూప్‌ దాస్‌ జీ మాట్లాడిన మాటలు వైరల్‌ అవుతున్నాయి.కొన్నాళ్ల క్రితం ఈయన చేసిన వ్యాఖ్యలు ఒక పేపర్‌ ప్రధాన పేజీలో వచ్చింది.ఇంతకు అందులో ఏముంది అంటే ఆడవారు నెలసరి సమయంలో కుటుంబంకు పూర్తిగా దూరంగా ఉండాలట.ముఖ్యంగా ఆ రోజుల్లో ఆడవారు వంట చేయకూడదట.అలా వంట చేసి పెట్టినట్లయితే వారు వచ్చే జన్మలో వేశ్యగా పుడతారట.ఇక ఆమె చేతి భోజనం చేసే భర్త తర్వాత జన్మలో ఎద్దుగా పుడతారంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

Telugu Cook Born Bitch, Indian Womens, Krishnaswaroop, Swamy Yana Buj, Telugu Wi

నెలసరి సమయంలో ఆడవారు ఇతరులకు మొహం చూపించవద్దని, ఒక వేళ అలా మొహం చూపిస్తే వారికి పాపం తలగడంతో పాటు చూసిన వారికి ఇబ్బందులు ఎదురవుతాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇలాంటి నీచమైన ప్రభోదలు చేస్తున్న ఆ స్వామీజీని ఏమనాలో అర్థం కావడం లేదు.స్వామీజీ అంటే చాలా మంచి విషయాలు చెప్పాలి.విజ్ఞానం కలిగించే విషయాలను వెళ్లడిరచాలి.కాని ఈయన మాత్రం ఇలాంటి నీతిమాలిన మాటలు చెబుతూ ఆడవారిని ఇంకా అట్టడుగున ఉండేలా చేయడం దారుణం.

Telugu Cook Born Bitch, Indian Womens, Krishnaswaroop, Swamy Yana Buj, Telugu Wi

ఈయన చెప్పిన ప్రభోదలు విన్న ఒక కాలేజ్‌ యాజమాన్యం తమ హాస్టల్‌లో ఉండే అమ్మాయిలను ఆ మూడు రోజులు వేరుగా ఉంచుతూ వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేయడంతో అంతా బయటకు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube