గాల్లో రెండు విమానాలు ఢీ.. ఆ తరువాత ఏమైందంటే...?

ఇప్పటివరకు బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలకు సంబంధిన వార్తలే ఎక్కువగా వినిపించేవి కానీ ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతుంది.గాలిలో రెండు తేలికపాటి విమానాలు ఒకదానినొకటి ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

 Victoria Light Plane Crash Kills 4 At Mangalore-TeluguStop.com

ఆస్ట్రేలియాలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కానీ అప్పటికే విమానంలోని నలుగురు మృతి చెందారు.ఆస్ట్రేలియాలోని సెంట్రల్ విక్టోరియాకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.దట్టమైన మేఘాల గుండా ప్రయాణం చేయడమే ఈ రెండు విమానాల ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు.భూమికి 4 వేల అడుగులకు పైగా ఎత్తులో విమానాలు ఎగురుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

Telugu Australia, Mangalore, Mid Air, Plane Crash, Small Crash, Victoriaplane-

అధికారులు ప్రాథమికంగా రెండు విమానాలలోని పైలెట్లకు ఎదురుగా ఏం ఉందో కనిపించి ఉండదని అందువలనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.ఉన్నతాధికారులు ఈ ఘోర ప్రమాదం గురించి విచారణకు ఆదేశించారు.ఈ ప్రమాదంలో ముక్కలు ముక్కలై క్రింద పడిన విమాన శకలాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube