దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నాడు.  

Kcr Ready To Play The Key Role In Central Level Politics - Telugu Kcr, Kcr Give The Responsibilities To Ktr, Kcr In Fedaral Front, Kcr Latest Update, , Telangana Cm Kcr

ఈ మేరకు ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ కు దేశ రాజకీయాల్లో మంచి పట్టు ఉంది.

Kcr Ready To Play The Key Role In Central Level Politics

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలకు దీటుగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ పార్టీల గుండెల్లో గుబులు పుట్టించాడు కేసీఆర్.ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో కేసీఆర్ బిజీ అయిపోవడంతో ఫెడరల్ ఫ్రంట్ సంగతి పక్కన పెట్టేశారు.

అయితే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనపడడం, బీజేపీ కూడా ఒక్కో రాష్ట్రంలో పట్టు కోల్పోతూ బలహీనపడుతుండంతో తాను ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఇదే సరైన సమయంగా కేసీఆర్ భావిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు మంచి పట్టు ఉన్నా కెసిఆర్ కు అందుకు తగ్గట్టుగా పరిస్థితులు అనుకూలించలేదు.తెలంగాణ ఎన్నికలతోనే ఇప్పటి వరకు బిజీగా ఉండటంతో ఆయన వాటిపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు.కానీ ఇప్పుడు తీరిక సమయం దొరకడం, తన కుమారుడు కేటీఆర్ సమర్ధుడైన నాయకుడిగా గుర్తింపు పొందడంతో ఆయనకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పి ఫెడరల్ ఫ్రంట్ ను యాక్టివ్ చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉండాలంటే ఎంపీ పదవి ఉండాలని భావిస్తున్న కేసీఆర్ ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.తనకు ఎప్పటి నుంచో సెంటిమెంట్ గా ఉంటూ వస్తున్న కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా అటు బిజెపి కి కూడా చెక్ పెట్టవచ్చని ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు త్వరలోనే టిఆర్ఎస్ నుంచి ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.ఇదే జరిగితే కేటీఆర్ త్వరలోనే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.ఇక తెలంగాణాలో మొదలుకాబోతున్న మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు