యూఎస్‌లో శక్తివంతమైన కోర్టుకు చీఫ్‌గా భారత సంతతి న్యాయమూర్తి

అమెరికాలో భారత సంతతి న్యాయమూర్తి అరుదైన ఘనత సాధించారు.యూఎస్ సుప్రీంకోర్టు తర్వాత అంతటి శక్తివంతమైన ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకు ఇండో అమెరికన్ జడ్జి శ్రీ శ్రీనివాసన్ ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాసియా వాసిగా రికార్డుల్లోకి ఎక్కారు.52 ఏళ్ల శ్రీనివాసన్‌ను యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ డీసీ సర్క్యూట్‌ చీఫ్ జడ్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.బరాక్ ఒబామా హయాంలోనే శ్రీనివాసన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికవుతారని ప్రచారం జరిగింది.1997 నుంచి డీసీ సర్క్యూట్ సభ్యుడిగా, 2013లో చీఫ్ జడ్జిగా ఉన్న మెరిక్ గార్లాండ్ వారసుడిగా శ్రీనివాసన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

 Sri Srinivasan Becomes First Indian American To Lead Powerful Federal Circuit C-TeluguStop.com

2016లోనే గార్లాండ్‌ను ఒబామా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేశారు.అయితే దీనిని సెనేట్‌లో రిపబ్లికన్లు అడ్డుకున్నారు.

శ్రీ శ్రీనివాసన్ మే 2013లో యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ విభాగంలోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు నియమితులయ్యారు.ఆయన తర్వాత నియోమి రావు సర్క్యూట్ కోర్టుకు ఎంపికైన రెండవ ఇండో అమెరికన్.

శ్రీ శ్రీనివాసన్ నియామకం పట్ల సెనేటర్ మార్క్ వార్నర్ అభినందలు తెలిపారు.అలాగే యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ ఛైర్మన్ అజిత్ పై మాట్లాడుతూ.

ఆయన నియామకం భారతీయ అమెరికన్/ కాన్సాస్ సమాజానికి ఒక మైలు రాయన్నారు.

Telugu Federal Circuit, Indian American, Sri Srinivasan, Srisrinivasan, Telugu N

శ్రీ శ్రీనివాసన్ ఇటీవల న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ.ఈ రంగంలో పురుషులు ఇప్పటకీ నాయకత్వ స్థానాల్లోనే ఆధిపత్యం చెలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు.పంజాబ్‌లోని ఛండీగఢ్‌లో పుట్టిన శ్రీ శ్రీనివాసన్ కాన్సాస్‌లోని లారెన్స్‌లో పెరిగారు.

ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, స్టాన్‌ఫోర్ట్ లా స్కూల్ నుంచి జేడీ, స్టాన్‌‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.

Telugu Federal Circuit, Indian American, Sri Srinivasan, Srisrinivasan, Telugu N

గ్రాడ్యుయేషన్ తర్వాత ఆయన యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లోని ఫోర్త్ సర్క్యూట్ న్యాయమూర్తి జె.హార్వి విల్కిన్సన్‌కు లా క్లర్క్‌గా, యూఎస్‌ సొలిసిటర్ జనరల్ కార్యాలయంలో బ్రిస్టో ఫెలో‌గా, యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సాండ్రా డే ఓ కానర్‌ వద్ద క్లర్క్‌గా పనిచేశారు.2011లో యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌‌కు నియమించబడే వరకు శ్రీనివాస్ యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు.ఈ క్రమంలో అమెరికా సుప్రీంకోర్టులో 25 కేసులను వాదించారు.హార్వర్డ్ లా స్కూల్‌లో అప్పీలేట్ న్యాయవాదితో కలిసి పౌర హక్కుల చట్టాలపై సెమినార్ నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube