కొత్తది : పిల్లల కోసం స్మార్ట్‌ డైపర్లు, వీటి ఉపయోగం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు

మారుతున్న టెక్నాలజీని చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు.రెండు దశాబ్దాలకు ముందు ఉన్న టెక్నాలజీతో పోల్చితే ఇప్పుడు 200 శాతం అడ్వాన్స్‌డు అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 Babys First Smart Diaper Made By American Company-TeluguStop.com

అద్బుతమైన టెక్నాలజీలు రావడంతో చాలా వరకు పనులు ఈజీ అయ్యాయి.ఎన్నో రకాలుగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

కొందరు టెక్నాలజీని ఉపయోగిస్తున్న తీరు చూస్తే నవ్వు ఆపుకోలేరు.స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత ఆ వాడకం మరింత ఎక్కువ అయ్యింది.

Telugu American, Baby, Babyssmart, Smart Diaper-Latest News - Telugu

తాజాగా అమెరికాకు చెంది ఎంఐటీ సంస్థ పిల్లల కోసం స్మార్ట్‌ డైపర్లను తయారు చేసింది.ఇకపై పిల్లలు డైపర్ల వల్ల ఇబ్బందులు పడి ఏడ్చే అవసరం లేదని వారు అంటున్నారు.డైపర్లు ఫుల్‌ అయిన సమయంలో తడి వల్ల పిల్లలు ఏడవడం జరుగుతుంది.తడి వల్ల ర్యాషెష్‌ కూడా వస్తూ అనారోగ్యం పాలవుతారు.అలాంటి ఇబ్బందులు ఇకపై లేకుండా పిల్లల డైపర్లు ఫుల్‌ అయిన విషయాన్ని తల్లి లేదా తండ్రి మొబైల్‌ కు నోటిఫికేషన్‌ రూపంలో పంపించే కొత్త టెక్నాలజీ వచ్చింది.Telugu American, Baby, Babyssmart, Smart Diaper-Latest News - Telugu

డైపర్లలలో ఉపయోగించే ఆర్‌ఎఫ్‌ఐడీ అనే ట్యాగ్‌ అవి నిండిన వెంటనే నోటిఫికేషన్‌ను సెండ్‌ చేస్తుంది.తద్వారా తల్లిదండ్రులు డైపర్లు మార్చవచ్చు.పిల్లల వయసును బట్టి.

వాటి బరువును బట్టి.డైపర్ల కంపెనీని బట్టి ఆర్‌ఎఫ్‌ఐడీ నోటిఫికేషన్‌ వచ్చేలా సెట్టింగ్స్‌ చేసుకోవచ్చు.

ప్రతి డైపర్‌కు వేరు వేరు ట్యాగ్‌లు కాకుండా ఒకే ట్యాగ్‌ను అన్నింటికి ఉపయోగించే విధంగా తయారు చేసినట్లుగా తెలుస్తోంది.మొత్తానికి తల్లిదండ్రులకు మరియు పిల్లలకు చాలా ఉపయోగదాయకమైన ఈ ట్యాగ్‌ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇది ఇండియన్‌ మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారా… ఇది మన వద్దకు వచ్చేందుకు కనీసం అయిదు ఏళ్లు అయినా పట్టవచ్చు.మీరు ఇంకా పెళ్లి చేసుకోని వాళ్లు అయితే మీకు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టే సమయం వరకు ఇది మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube