టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటంచిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేమికుల రోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా ఈ సినిమా రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.దీంతో ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడింది.
ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి.విజయ్ దేవరకొండ స్థాయికి ఈ కలెక్షన్లు చాలా తక్కువని, సినిమా అనుకున్న స్థాయిలో సక్సె్స్ కాలేదని పలువురు సినీ విమర్శకులు అంటున్నారు.
రిలీజ్ రోజును పోల్చుకుంటే ఈ కలెక్షన్లు మూడో రోజున మరింత తగ్గాయి.రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగున్నా సినిమాలో సత్తా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది.
ఇక ఈ సినిమా మూడు రోజులు ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.6.97 కోట్లు వసూలు చేసింది.ఈ కలెక్షన్లు మరింత తగ్గుతాయని సినీ వర్గాలు అంటున్నాయి.
ఏరియాల వారీగా ఈ సినిమా మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 3.51 కోట్లు
సీడెడ్ – 0.63 కోట్లు
నెల్లూరు – 0.26 కోట్లు
కృష్ణా – 0.40 కోట్లు
గుంటూరు – 0.62 కోట్లు
వైజాగ్ – 0.71 కోట్లు
ఈస్ట్ – 0.47 కోట్లు
వెస్ట్ – 0.37 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 6.97 కోట్లు
.