వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు.. ఎంతో తెలుసా?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటంచిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేమికుల రోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 World Famous Lover First Weekend Collections-TeluguStop.com

కాగా ఈ సినిమా రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.దీంతో ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడింది.

ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి.విజయ్ దేవరకొండ స్థాయికి ఈ కలెక్షన్లు చాలా తక్కువని, సినిమా అనుకున్న స్థాయిలో సక్సె్స్ కాలేదని పలువురు సినీ విమర్శకులు అంటున్నారు.

రిలీజ్ రోజును పోల్చుకుంటే ఈ కలెక్షన్లు మూడో రోజున మరింత తగ్గాయి.రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగున్నా సినిమాలో సత్తా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది.

ఇక ఈ సినిమా మూడు రోజులు ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.6.97 కోట్లు వసూలు చేసింది.ఈ కలెక్షన్లు మరింత తగ్గుతాయని సినీ వర్గాలు అంటున్నాయి.

ఏరియాల వారీగా ఈ సినిమా మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 3.51 కోట్లు

సీడెడ్ – 0.63 కోట్లు

నెల్లూరు – 0.26 కోట్లు

కృష్ణా – 0.40 కోట్లు

గుంటూరు – 0.62 కోట్లు

వైజాగ్ – 0.71 కోట్లు

ఈస్ట్ – 0.47 కోట్లు

వెస్ట్ – 0.37 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 6.97 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube