ఆ ఏడాది ఎంప్లాయర్ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డుల్లో సగం భారతీయులకే

యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం 2019 ఆర్ధిక సంవత్సరానికి గాను ఫెడరల్ ప్రభుత్వం జారీ చేసిన ఎంప్లాయర్ స్పాన్సర్డ్‌ గ్రీన్ కార్డుల్లో సగానికి సగం భారతీయులే అందుకున్నారు.సెప్టెంబర్ 2019 వరకు అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న 64,906 మంది భారతీయుల్లో 56,608 మందికి గ్రీన్‌కార్డులకు అమెరికా ఆమోదముద్ర వేసింది.

 Indians Bag Half Of Employer Sponsored Green Cards In 2019-TeluguStop.com

వీటిలో1,352 దరఖాస్తులు తిరస్కరించగా, సెప్టెంబర్ నాటికి మరో 6,946 కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.భారతీయల నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య బ్యాచిలర్ డిగ్రీలు ఉన్న వారికి యూఎస్ ఇచ్చిన వార్షిక హెచ్-1 బీ వీసాలకు సమానం.

ఆ ఏడాది ఎంప్లాయర్ స్పాన్సర్డ్ గ్రీన్ కార్డు కోసం యూఎస్ సిటిజన్‌షిప్ ఏజెన్సీకి 1,48,415 దరఖాస్తులు రాగా… 20,481 దరఖాస్తులతో భారతీయులు, చైనా తర్వాత ఉన్నారు.ఈ కాలంలో అమెరికా 1,15,458 గ్రీన్‌కార్డులను జారీ చేసింది.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సంబంధించి యూఎస్‌సీఎస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Telugu Citizenship, Green, Indians, Indiansbag, Telugu Nri, Visa-Telugu NRI

అయితే ఏజెన్సీ తీరు చట్టబద్ధమైన వలసలకు వ్యతిరేకంగా.ఒక రకమైన గోడను సృష్టించేలా ఉందని ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల పోర్టల్ ఇమ్మిగ్రేషన్.కామ్ న్యాయవాది రాజీవ్ ఎస్ ఖన్నా ఆరోపించారు.

దీనికి సంబంధించి తాము ఫెడరల్ కోర్టులలో పలు వ్యాజ్యాలను దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు.దరఖాస్తుదారుడు అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి సంబంధిత యజమానులు ఐ-140 ఇమ్మిగ్రేషన్ పిటిషన్‌ను ప్రభుత్వానికి సమర్పించారు.

కార్మికుడు అసాధారణమైన నైపుణ్యాలు లేదా ప్రతిభను కలిగి ఉన్నప్పుడు లేదా అమెరికాలో ఆ పదవికి అర్హత కలిగిన కార్మికులు లేనట్లయితే దరఖాస్తు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.ఎంప్లాయర్ స్పాన్సర్డ్ గ్రీన్ కార్డు కోసం భారతీయ దరఖాస్తుదారుల సంఖ్య 2009లో 15,060 ఉండగా 2019 నాటికి అది 64,906కు పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube