ఏపీలో ముదురుతున్న సీఏఏ, ఎన్నార్సీ వివాదం

దేశ వ్యాప్తంగా ఎన్డీఏ యేతర పక్షాలు అన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బిల్లు సీఏఏ, ఎన్నార్సీ.ఇక ఈ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఎక్కువగా ముస్లిం సమాజం రోడ్డు మీదకి వస్తుంది.

 Raise Voice In Ap Caa And Nrc Bill-TeluguStop.com

ఇక కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు, కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు.దీనిపై ఆయా రాష్ట్రాల చట్టసభల్లో వ్యతిరేకంగా తీర్మానం కూడా చేస్తున్నాయి.

ఓ విధంగా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం బిల్లుపై గందరగోళం నెలకొని ఉంది.ఎట్టి పరిస్థితిలో ఈ బిల్లుని అమలు చేసి తీరుతామని బీజేపీ సర్కార్ గట్టిగా పట్టుబడుతుంది.

ఈ బిల్లుని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించిన కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి తీరాల్సిందే అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అయితే ఈ ఉద్యమ సెగ ఇప్పటి వరకు ఏపీకి పూర్తి స్థాయిలో తగలలేదు.

ఏపీలో జరుగుతున్నా రాజధాని రగడకి మీడియా ఇచ్చిన ప్రాధాన్యత ఈ పౌరసత్వ సవరణ చట్టంకి ఇవ్వడం లేదు.అయిన కూడా అక్కడక్కడ ముస్లిం మైనార్టీలు, కమ్యూనిస్ట్ లు, క్రిస్టియన్ సంఘాలు సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి.

ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలని కలిసి వినతిపత్రం ఇస్తున్నాయి.అయితే ఈ బిల్లుకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయంలో ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎటు తేల్చుకోలేకపోతుంది.

కొన్ని రాజకీయ పరిస్థితితుల కారణంగా మెజారిటీ ఉన్న బలంగా మాట్లాడలేక పోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బిల్లుకి సంబందించిన సెగ ఏపీలో కూడా రాజుకుంటుంది.

కొద్ది రోజుల క్రితం ఈ సీఏఏ వ్యతిరేక బిల్లుకి ప్రభుత్వం మద్దతు ఇస్తే వెంటనే రాజీనామా చేస్తానని ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా ప్రకటించారు.తాజాగా విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని కూడా అసెంబ్లీలో సీఏఏకి వ్యతిరేకంగా ప్రవేశ పెట్టె బిల్లుకి టీడీపీ మద్దతు ఇవ్వాలని లేదంటే రాజీనామా చేస్తానని ప్రకటించాడు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు ఈ ఒక్క విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే స్టాండ్ తీసుకుంటాయ లేక భిన్న ద్రువాలుగా ఉంటాయా అనే ఆసక్తి నెలకొని ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube