రెవెన్యూ అధికారులుగా బెదిరింపులు, 90 కోట్లు వసూలు: కెనడాలో భారతీయ జంట అరెస్ట్

ఓవర్సీస్ టెలిఫోన్ కుంభకోణంలో భారత సంతతి దంపతులను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.దీనిలో భాగంగా పన్ను వీరు పన్ను అధికారులుగా నటిస్తూ కెనడీయన్ల నుంచి 90.68 కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.టొరంటోలోని బ్రాంప్టన్‌కు చెందిన గురీందర్ ప్రీత్ ధాలివాల్ (37), అతని భార్య ఇందర్‌ప్రీత్ ధాలివాల్ (36)లను ఈ కేసులో భాగంగా ఆదివారం అరెస్ట్ చేశారు.

 Duping Canadians Worth Millions-TeluguStop.com

ఈ దంపతులిద్దరు తమను తాము కెనడా రెవెన్యూ ఏజెన్సీ (సీఆర్ఏ), రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) అధికారులుగా చెప్పుకుంటూ 2014 నుంచి మోసాలకు తెరతీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని.

చెల్లించని పక్షంలో అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడేవారు.ఈ క్రమంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో పలువురు కెనడీయన్ల వద్ద నుంచి 16.8 మిలియన్ డాలర్లు (రూ.90.8 కోట్లు) వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు.

Telugu Canadians Worth, Indian, Telugu Nri Ups-

ఈ కుంభకోణం కారణంగా రెవెన్యూ అధికారులు ప్రజలను కలిసినప్పుడు వారిని చాలా అనుమానాస్పదంగా చూసినట్లు ఆర్‌సీఎంపీ తెలిపింది.వసూలు చేసిన డబ్బును ఒక నిర్దిష్ట పేరు, చిరునామా, డ్రాప్ పాయింట్‌కు కొరియర్‌ చేయమని చెప్పేవారని తెలుస్తోంది.దీని ఆధారంగానే ధాలివాల్ దంపతులు ఇరుక్కున్నారని ఆర్‌సీఎంపీ ఇన్స్‌పెక్టర్ జిమ్ ఓగ్డెన్ తెలిపారు.

ఈ క్రమంలో కెనడా నుంచి భారత్‌కు అక్రమంగా చేరవేస్తున్న డబ్బు రవాణాకు అంతరాయం కలిగించామని.ఇది ఈ స్కామ్‌లో పాల్గొంటున్న వారిపై ప్రభావాన్ని చూపిందని ఓగ్డెన్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube