జగన్ బీజేపీని కలిపింది పీకే నా ?

టిడిపి అధినేత చంద్రబాబు మీద ఉన్న కోపంతో ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి అన్ని విధాల సహకారం అందించి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా తన వంతు కృషి చేశారు కేంద్ర బిజెపి పెద్దలు.ఏపీలో అనుకున్నట్టుగానే వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది.

 Prashanth Kishore Narendra Modi Ys Jagan Ysrcp Bjp-TeluguStop.com

తర్వాత రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయి అని అంతా భావించినా వైసిపి తో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బిజెపి వ్యవహారాలు చేయడమే కాకుండా, వైసీపీ ని టార్గెట్ చేస్తూ బిజెపి నాయకులు విమర్శలు చేయడంతో ఈ రెండు పార్టీల మధ్య వైరం మొదలైంది.ఒక దశలో జగన్ టార్గెట్ చేస్తూ బీజేపీ పావులు కదపడం అదే సమయంలో మరింత వేగంగా జగన్ అక్రమాస్తుల కేసు ముందుకు తీసుకు వెళ్లేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నించిన నేపథ్యంలో జగన్ మళ్ళీ జైలుకి వెళ్తాడు అనే ప్రచారం జరిగింది.

కానీ అనూహ్యంగా జగన్ ను మోదీ ఢిల్లీకి పిలిపించడం, ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకు తాము మద్దతు ఇస్తామని, ఏపీకి అవసరమైన నిధులు కేటాయింపులు చేస్తామని, మీకు అన్ని రకాలుగా అండగా ఉంటామంటూ అంటూ మోదీ జగన్ కు చెప్పడం జరిగాయి.ఇక ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి కలిసిన జగన్ కు ఎన్డీయే లో చేరాల్సిందిగా ప్రతిపాదన పెట్టడం, మంత్రి పదవులు కూడా ఇస్తామని ఆఫర్ చేయడం ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అయితే ఇంత అకస్మాత్తుగా బిజెపి జగన్ ను దగ్గర చేసుకోవడానికి కారణం ఏంటి అనేది అందరికీ ఆసక్తిగా మారింది.

Telugu Bjp Ys Jagan, Narendra Modi, Ys Jagan, Ysrcp-Telugu Political News

వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కారణంగానే బిజెపి జగన్ ను దగ్గర చేసుకున్నట్టు తెలుస్తోంది.మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ బీహార్ లోని జోతిష కుమార్ సారధ్యంలోని జేడీయూ లో కీలక నాయకుడు గా ఉన్నాడు.బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాట పడ్డాడు.

అయితే జేడీయూ బిజెపికి దగ్గర అవుతుండడాన్ని వ్యతిరేకించిన ప్రశాంత్ కిషోర్ ను ఆ పార్టీ బహిష్కరించింది.దీంతో సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు.

అది కాకుండా దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటినీ తన వ్యూహాలతో గెలిపించేందుకు ఒప్పందాలు చేసుకోవడం, ఒక్కో రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు.

ఏపీలో వైసీపీకి అంత స్థాయిలో మెజార్టీ రావడానికి, ఢిల్లీలో క్రేజివాల్ ప్రభుత్వం ఏర్పడటానికి పీకే కృషి చాలానే ఉంది.

పశ్చిమ బెంగాల్ లో జరగబోయే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు ఇవ్వబోతున్నాడు.అలాగే తమిళనాడులోనూ తన సేవలను అందించబోతున్నాడు.ఇదే అదునుగా భావిస్తున్న ఆయన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి తాను దేశ రాజకీయాల్లో కీలకం అవ్వాలని భావిస్తున్నాడు.అదే జరిగితే రాజకీయంగా తమకు ఎదురు దెబ్బ తగులుతుందని ముందుగానే అంచనా వేసిన బిజెపి జగన్ పీకే ట్రాప్ లో పడకుండా ముందుగా ఇలా జగన్ ను దగ్గర చేసుకున్నట్టు అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube