పొత్తు కోసం వైసీపీ ఆరాటం... అవసరం లేదంటున్న బీజేపీ

ఏపీలో పార్టీల మధ్య ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని అక్కడి పార్టీల తీరు చూస్తూ ఉంటే ఎవరికైనా అర్ధమవుతుంది.అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్ధి పార్టీలని ఎలా నాశనం చేయాలి.

 Bjp Not Interested To Alliance With Ysrcp-TeluguStop.com

వాటికి ప్రజాదరణ లేకుండా చేసి వాటి ఉనికి లేకుండా చేయాలి అనే లక్ష్యంతోనే వైసీపీ నాయకులుగాని, ముఖ్యమంత్రి జగన్ గాని పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలని దెబ్బ తీసేందుకు ఏ ఒక్క అవకాశం ఉన్న వైసీపీ వినియోగించుకుంటుంది.

అదే సమయంలో ఇష్టానుసారంగా ప్రత్యర్ధి పార్టీల మీద బురద జల్లెసం కడుక్కోండి అనే విధంగా వ్యవహరిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు.మరో వైపు అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలలో లేని లోపాలని కూడా ఎత్తి చూపిస్తూ టీడీపీ, జనసేన పార్టీలు తమకి అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి.

చిన్న వైఫల్యం కనిపించిన దానిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఎలా అయిన బీజేపీతో జత కట్టి ఎన్డీఏ కూటమిలో చేరిపోయి మరింత బలం పెంచుకోవాలని దాంతో ఓ వైపు జనసేన పార్టీని ఒంటరి చేసి మరో వైపు టీడీపీని అవినీతి కేసులలో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఆ పార్టీ నేతల మాటలు చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.

వైసీపీ నేతలు నొప్పింపక అన్నట్లు అవసరం అయితే అభివృద్ధి కోసం ఎన్డీఏలో చేరుతామని ఓ వైపు చెబుతూ, దానిని జగన్ నిర్ణయమే ఫైనల్ అంటూ మరో మాట కూడా చెబుతారు.దీనిపై బీజేపీ ఏపీ ఎన్ చార్జ్ సునీల్ దియోధర్ ఊహించని విధంగా వైసీపీని ఇబ్బందులలో పెట్టాడు.

అసలు తమకి ఏపీలో వైసీపీ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఇప్పటికే జనసేనతో తాము పొత్తు పెట్టుకున్నామని అదే కొనసాగుతుందని స్పష్టం చేసేసారు.ఏపీలో అధికార పార్టీ తమకి ప్రత్యర్ధి అని, ఆ పార్టీ వైఫల్యాలని ప్రజలలోకి తీసుకెళ్తామని తేల్చి చెప్పేశారు.

ఒక ముఖ్యమంత్రిగానే జగన్ ప్రధానిని కలవడం జరిగిందని, ఇందులో రాజకీయ ఊహాగానాలకి అవకాశం లేదని చెప్పారు.సునీల్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల మాటలు అన్ని కూడా కేవలం గాలి మాటలే అని అర్ధమైపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube