పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ఏపీ సీఎం బావ, స్వల్ప గాయాలు

ఏపీ సీఎం జగన్ బావ,సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే.మత ప్రచార కార్యక్రమాలతో బిజీ గా ఉండే ఆయన కారు కు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది.

 Anil Kumar Ysrcp Jagan-TeluguStop.com

హైదరాబాద్ నుంచి విజయవాడవెళ్తుండగా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో దూసుకెళ్లడం తో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం చోటుచేసుకోలేదు.

అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాలకు గురికావడం తో వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినట్లు తెలుస్తుంది.బ్రదర్ అనిల్ తో కారు లో ఆయన గన్ మెన్,డ్రైవర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే అత్యంత భద్రతాపరిణాలు కలిగిన కారు కావడం తో సకాలంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడం తో అందరూ కూడా స్వల్ప గాయాలపాలైనట్లు తెలుస్తుంది.

Telugu Sharmila, Ys Jagan, Ysrcp-Latest News - Telugu

అయితే ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ఘటనాస్థలికి చేరుకుని ఆయన కారులో అనిల్‌, డ్రైవర్‌, గన్‌మెన్‌లను విజయవాడలోని ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube