వైరల్‌ : వాలెంటైన్స్‌ డే రోజు ఆ కాలేజ్‌ అమ్మాయిలు వింత ప్రతిజ్ఞ, మాటమీద నిలబడేనా?

కొన్ని దేశాల్లో మినహా నిన్న ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్‌డే జరుపుకున్న విషయం తెల్సిందే.పుల్వామా దాడి నేపథ్యంలో మన ఇండియాలో ఈసారి వాలెంటైన్స్‌ డే వేడుకలు పెద్దగా లేవని చెప్పుకోవాలి.

 Maharashtra Amravati District Girls Take Pledge Against Love Marriage-TeluguStop.com

అమరవీరుల స్మారకార్థం పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు, అలాగే ప్రేమకు వ్యతిరేకంగా కొందరు నిరసనలు చేశారు.అయితే మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో మాత్రం వింత సంఘటన జరిగింది.

స్థానిక ఒక యూనివర్శిటీ కాలేజ్‌లో అమ్మాయిలు వింత ప్రతిజ్ఞ చేశారు.

Telugu Maharashtra, Pulwama Attack, Day-General-Telugu

కాలేజ్‌లో వాలెంటైన్స్‌ డే వేడుకలను బ్యాన్‌ చేయడంతో పాటు వారు పెద్ద ఎత్తున ప్రేమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.20 ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రుల గౌరవం కాపాడే విధంగా పెళ్లి చేసుకుంటాం, వారు చెప్పిన అబ్బాయిలనే పెళ్లి చేసుకుంటాం తప్ప ప్రేమ వివాహం చేసుకోము అంటూ విద్యార్థులు స్వయంగా ప్రతిజ్ఞ చేశారు.అబ్బాయిల ప్రతిజ్ఞ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

వారు తీసుకున్న నిర్ణయాన్ని కొందరు అభినందిస్తున్నారు.తల్లి దండ్రుల గురించి ఆలోచించిన వారు చాలా అభినందనీయులు అంటూ ప్రశంసలు కురిపించారు.

Telugu Maharashtra, Pulwama Attack, Day-General-Telugu

అమ్మాయిల జీవితం బాగుండాలని తల్లిదండ్రులు అనుకుంటారు.కాని అమ్మాయిలు అమాత్రం ఆవారాల వెంట తిరిగి వారిని పెళ్లి చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు ఆవారా గాళ్లు చేసుకుంటారు అంటూ సర్వేలో వెళ్లడయ్యింది.అందుకే అమ్మాయిలు ప్రేమ వివాహాన్ని వద్దనుకోవడం మంచి నిర్ణయంగా చెబుతున్నారు.

Telugu Maharashtra, Pulwama Attack, Day-General-Telugu

ప్రతిజ్ఞ అయితే చేశారు కాని వీరు తమ ప్రతిజ్ఞపై నిలబడుతారా అనేది చూడాలి.ప్రేమ అనేది చాలా సున్నితమైన విషయం.ఆ విషయంలో ఎప్పుడు ఎవరి భావన ఎలా ఉంటుందో చెప్పలేం.అందుకే ఈ అమ్మాయిలు చేసిన ప్రతిజ్ఞపై నిలబడాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube