ఆర్ఆర్ఆర్‌లో హీరోల ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఫిక్స్..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమాల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Rrr Ntr Ram Charan First Look Date Fixed-TeluguStop.com

అయితే చిత్ర యూనిట్ మాత్రం వరుసగా ఫస్ట్ లుక్ పోస్టర్లు వాయిదా వేస్తూ వస్తోంది.కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒకేసారి కాకుండా రెండు తేదీల్లో రిలీజ్ చేయాలని జక్కన్న ఫిక్స్ అయ్యాడు.

ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి, వారికి సంబంధించిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేసేందుకు డేట్‌లను ఫిక్స్ చేశాడు జక్కన్న.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజైన మార్చి 27న చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను, మే 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా కొమురం భీం పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

తమ అభిమాన హీరోల పుట్టిన రోజున ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఎట్టకేలకు రిలీజ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరి తారక్, చరణ్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube