దుబాయ్ జైల్లో భారతీయుడు: భర్తను విడిపించాలంటూ ప్రభుత్వానికి భార్య విన్నపం

దేశం కానీ దేశంలో అరెస్ట్ కాబడి జైలులో మగ్గుతున్న తన భర్తను విడిపించి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా హైదరాబాద్‌కు చెంది రాజా బేగం అనే మహిళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.

 Indian Wife Appeals To Government To Free Husband-TeluguStop.com

తన భర్త సయ్యద్ దయానత్ హుస్సేన్ రజ్వీ 2014 జూన్‌లో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి, అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు.ఆ తర్వాత 2017 సెప్టెంబర్‌లో సెలవుపై భారతదేశానికి వచ్చాడని.15 రోజుల తర్వాత తిరిగి దుబాయ్ వెళ్లినట్లు రాజా బేగం తెలిపారు.తాను 2020 జనవరి 6న మరోసారి భారత్‌కు వస్తానని తన భర్త చెప్పారని.దీనిలో భాగంగా అతను దుబాయ్ విమానాశ్రయంలో ఉండగా స్థానిక అధికారులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపారని రాజా బేగం ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Telugu Nri Ups, Appeals-

తన భర్తను ఏ కారణంపై అరెస్ట్ చేశారో, అసలు సమస్య ఏమిటో తనకు తెలియదని ఆయనను రక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి, దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు రాజా బేగం కన్నీటి పర్యంతమయ్యారు.కాగా 2017 డిసెంబర్ 28 వరకు ఆరు అరబ్ దేశాల గల్ఫ్ సహకార మండలి సభ్యదేశాలైన సౌదీ అరేబియాలో 2,229, యూఏఈలో 1,628, కువైట్‌లో 506, ఖతార్‌లో 196, బహ్రెయిన్‌లో 77, ఒమన్‌లో 60 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube