జగన్ పీకే అయితే ఏంటి ? అంతకు మించి కొత్త ఎత్తు వేసిన బాబు

కిందపడ్డా పైచేయి నాదే అన్నట్లుగా టిడిపి అధినేత చంద్రబాబు వ్యవహరిస్తూ ఉంటారు.ఎప్పటికప్పుడు రాజకీయంగా పైచేయి సాధించే విధంగా ఆయన వ్యవహారాలు నడుపుతూ ఉంటారు.

 The Tdp Seems To Have Hired Robin Sharma As Its Political Strategist-TeluguStop.com

ఏపీలో తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు గాను కేవలం 23 స్థానాలు మాత్రమే దక్కించుకున్నా, ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైనా చంద్రబాబు ఎక్కడా పెద్దగా ఆయనలో ఆందోళన కనిపించడంలేదు.పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా దానిని తిరిగి గట్టెక్కించగలను అనే నమ్మకం, ధైర్యం ఆయనలో ఇప్పటికీ పోలేదు.

తన వయసును కూడా లెక్కచేయకుండా చంద్రబాబు రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర వహించిన రాజకీయ సలహాదారులు ప్రశాంత్ కిషోర్ కు చెక్ పెట్టడమే తన ధ్యేయంగా బాబు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

Telugu Apcm, Jaganprashanth, Rabinsharma, Tdphired-Political

వచ్చే ఎన్నికల నాటికి మరింత బలంగా తయారవ్వడంతో పాటు ప్రస్తుతం ఏపీ లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని టిడిపి చూస్తోంది.దీనిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ కు స్నేహితుడైన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వంటి సంస్థలకు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న రాబిన్ శర్మ ను టిడిపి తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఒప్పందం చేసుకున్న టిడిపి స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పనిచేసేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి గట్టెక్కే విధంగా ఎన్నికల వ్యూహాలు రాబిన్ శర్మ రచిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో శర్మ ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం వ్యవహారాలను చూసుకునే వారు.ఆయన పనితీరు పై నమ్మకం కలిగిన తర్వాత ఇప్పుడు టిడిపి ఆయనను తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

రాబోయే నాలుగేళ్ల పాటు వారు టిడిపికి సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నారా.ఏపీలో ప్రస్తుతం 3 రాజధానుల ప్రకటన, టిడిపి నాయకుల పై వైసీపీ ప్రభుత్వం వేధింపులు తదితర విషయాలపై రాబిన్ శర్మ బృందం అధ్యయనం చేస్తోందట.

దీనిపై త్వరలోనే చంద్రబాబుకు నివేదిక కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

Telugu Apcm, Jaganprashanth, Rabinsharma, Tdphired-Political

రాబిన్ శర్మతో ఒప్పందం చేసుకునేందుకు టీడీపీ పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.వైసీపీ కూడా తాము అధికారంలో ఉన్నా తన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని డిసైడ్ అయిన నేపథ్యంలో చంద్రబాబు రాబిన్ శర్మ పేరు తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube