సెనేట్ బరిలో భారత సంతతి మహిళ: ప్రచార విరాళంగా 7 మిలియన్ డాలర్ల సేకరణ

అమెరికా సెనేట్ రేసులో పోటీపడుతున్న భారత సంతతికి చెందిన మహిళా రాజకీయ వేత్త సారా గిడియాన్ ప్రచార విరాళంగా 7.6 మిలియన్ డాలర్లు సేకరించారు.48 ఏళ్ల గిడియాన్ ఇండో- అమెరికన్ కుమార్తె.ప్రస్తుతం ఆమె మైనే స్టేట్ అసెంబ్లీకి స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.

 Indian Origin Politician Sara Gideon Raises Over 7 Million For Us Senate Race-TeluguStop.com

రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ సుపాన్ కాలిన్స్‌ను నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని ఆమె పట్టుదలగా ఉన్నారు.
మరోవైపు ప్రస్తుత సేనేటర్ కాలిన్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు, ఇప్పటి వరకు ఆయన 10.9 మిలియన్ డాలర్లకు పైగా విరాళంగా సేకరించడం గమనార్హం.డిసెంబర్ 31తో ముగిసిన చివరి త్రైమాసికంలో గిడియాన్ ప్రచార విరాళంగా 3.5 మిలియన్ డాలర్లను సమీకరించారని, మొత్తంగా ఆమె విరాళాల విలువ 7.6 మిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.నిధుల సేకరణలో కాలిన్స్ ముందున్నప్పటికీ.గత త్రైమాసికంలో మాత్రం గిడియాన్ అతనికంటే ఎక్కువ నిధులను సేకరించారు.
అర్మేనియాకు చెందిన గిడియాన్ గత ఏడాది జూన్‌లో యూఎస్ సెనేట్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు.గత ఏడు నెలల కాలంలో తాము రాష్ట్రంలోని మూలమూలనా ప్రయాణించే సమయంలో బలమైన ఉద్యమాన్ని నిర్మించామని ‘‘సప్పర్స్ విత్ సారా’’ అనే నినాదంతో తాము ముందుకు సాగినట్లు గిడియాన్ ఓ ప్రకటనలో తెలిపారు.

తాను ప్రచార రేసులో భాగంగా కార్పోరేట్ పీఏసీ డబ్బును అంగీకరించడం లేదన్నారు ఆమె స్పష్టం చేశారు.డెమొక్రాటిక్ ప్రైమరీలో, గిడియాన్‌తో పాటు లాబీయిస్ట్ బెట్సీ స్వీట్ హలో‌వెల్, మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ రాస్ లాజ్యూనెస్, సాకోకు చెందిన డిఫెన్స్ అటార్నీ బ్రె కిడ్మాన్‌లు పోటీపడుతున్నారు.

Telugu Indianorigin, Republican, Sara Gideon, Senate, Telugu Nri, Senate Race-

గిడియాన్ వాషింగ్టన్‌లోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ఇలియట్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుంచి గ్రాడ్యుయేషన్ అందుకున్నారు.అలాగే యూఎస్ సెనేటర్ క్లైబోర్న్ పెల్ వద్ద ఇంటర్న్‌గా పనిచేశారు.గిడియాన్ మొట్టమొదటి సారిగా 2012లో మెయిన్ హౌస్‌కు ఎన్నికయ్యారు.2014లో మైనే ప్రతినిధుల సభకు అసిస్టెంట్ మెజారిటీ నాయకురాలిగా ఎంపికయ్యారు.2016లో, ఆమె సహచరులు స్పీకర్‌గా ఎన్నికయ్యారు.యూఎస్ సెనేటర్‌గా పోటీ చేయడానికి డెమొక్రాటిక్ సెనేటోరియల్ ప్రచార కమిటీ అనుమతించింది.

గిడియాన్ తండ్రి భారత్ నుంచి వలస వచ్చి రోడ్ ఐలాండ్‌లో పిల్లల వైద్యుడిగా పనిచేశారు.ఆయన నలుగురు పిల్లల్లో గిడియాన్ చిన్నవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube