అలాంటి కథలు మాత్రమే కావాలంటున్న మెగాస్టార్

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా, ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఒకప్పటి తన చరిష్మా మళ్ళీ చూపిస్తూ వరుసగా సక్సెస్ లు అందుకున్నాడు.కమర్షియల్ స్టొరీ విత్ సోషల్ మెసేజ్ తో వచ్చిన ఖైది 150 మూవీ, పీరియాడికల్ కథనంతో వచ్చిన సైరా సినిమాలు రెండు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచి మెగాస్టార్ ని ఎవరు అందుకోలేరు అనేంతగా సక్సెస్ అయ్యాయి.

 Chiranjeevi Change The Storie Goner For New Movies-TeluguStop.com

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖలో పని చేసే ఒక ఉద్యోగిగా కనిపిస్తాడని తెలుస్తుంది.

ఈ సినిమా కూడా ఒక సోషల్ ఇష్యూని టచ్ చేసే సినిమా అనే తెలుస్తుంది.కొరటాల సినిమా అంటే కచ్చితంగా అందులో అంతర్లీనంగా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది.

ఇదిలా ఉంటే ఇక చిరంజీవి కూడా తన కథల విషయంలో కొత్త పంథాలోకి వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.ఇకపై రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఇంతకాలం అభిమానులని దృష్టిలో పెట్టుకొని డాన్స్ లు, ఫైట్స్ కచ్చితంగా ఉండే విధంగా కమర్షియల్ సినిమాలు మాత్రమే ఎక్కువగా చేశారు.అయితే ఈ సారి కాస్తా తన పెద్దరికానికి సరిపోయే విధంగా సోషల్ ఎలిమెంట్స్ ప్రధానంగా కథలు ఎంచుకోవాలని భావిస్తున్నారు.

అలాంటి కథలతోనే ప్రేక్షకుల ముందుకి రావాలని అనుకుంటున్నారు.ఫాన్స్ కూడా తనని ఇప్పుడిప్పుడే అలాంటి పాత్రలలో చూడటానికి ఇష్టపడుతున్నారని సైరా సినిమా ద్వారా అర్ధం కావడంతో జోనర్ మారుస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube