సరిలేరు నీకెవ్వరు 32 రోజుల కలెక్షన్లు.. ఎంతంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో తొలి సినిమాగా రిలీజ్ అయ్యింది.దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ మాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్‌ను సాధించింది.

 Sarileru Neekevvaru 32 Days Collections-TeluguStop.com

ఇక పండగ సెలవులు కూడా కలిసి రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్, క్లాస్ వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొట్టింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 32 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.137.64 కోట్ల వసూళ్లు సాధించింది.ఈ సినిమాతో మహేష్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు.

రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 32 రోజులకుగాను కలెక్ట్ చేసిన మొత్తం ఏరియాలవారీగా ఈ విధంగా ఉంది.

నైజాం – 39.55 కోట్లు

సీడెడ్ – 15.55 కోట్లు

గుంటూరు – 9.90 కోట్లు

ఉత్తరాంధ్ర – 19.77 కోట్లు

ఈస్ట్ – 11.30 కోట్లు

వెస్ట్ – 7.42 కోట్లు

కృష్ణా – 8.85 కోట్లు

నెల్లూరు – 4.03 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 116.37 కోట్లు

కర్ణాటక – 7.51 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.81 కోట్లు

ఓవర్సీస్ – 11.95 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు – 137.64 కోట్లు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube