వదిలే ప్రసక్తే లేదంటున్న సమంత

టాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా సమంత తన సత్తా చాటుతున్న క్రమంలోనే అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.చైతూతో పెళ్లి తరువాత కూడా సమంత స్టార్ హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేస్తూ మిగతా హీరోయిన్లకు చుక్కలు చూపిస్తోంది.

 Samantha Clarifies On Her Retirement Statement-TeluguStop.com

అయితే ఇటీవల సమంత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేయడంతో ఆమె సినిమాలకు త్వరలోనే స్వస్తి చెప్పనుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా జాను సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చిన సమంత, ఓ ఇంటర్వ్యూలో తనకు సినిమాలకంటే కూడా తన కుటుంబాన్ని చూసుకోవడమే ముఖ్యం అంటూ కామెంట్ చేసింది.

దీంతో సమంత ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందంటూ వార్తలు వచ్చాయి.సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి.

ఈ విషయం తెలుసుకున్న సమంత తన రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చింది.

తనకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గినా కూడా సినిమాలను వదిలే ప్రసక్తే లేదని ఆమె తెలిపింది.

హీరోయిన్‌గా ఛాన్సులు రాకపోతే ఏదో విధంగా ఇండస్ట్రీలోనే ఉంటానంటూ సమంత తేల్చి చెప్పేసింది.దీంతో సమంత ఫ్యాన్స్ తమ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పడం లేదంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube