క్యాట్ ని ఆశ్రయించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్

సీనియర్ ఐపీఎస్,ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ను ఏపీ ప్రభుత్వం గతవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.అయితే తన సస్పెండ్ ను కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) లో సవాల్ చేసినట్లు తెలుస్తుంది.

 Senior Ips Officer Ab Venkateswara Rao Challenges His Suspension In Cat-TeluguStop.com

ప్రభుత్వం తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని,కొన్ని ఒత్తిళ్ల కారణంగానే నాపై ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని ప్రకటించాలి అంటూ ఏబీ కోరినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా గతేడాది మే నుంచి కూడా తనకు జీతం కూడా చెల్లించడం లేదు అంటూ ఏబీ తెలిపారు.

ఏబీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలు చేశారని ప్రభుత్వం చెబుతోంది.

Telugu Abson, Abvenkateswara, Seniorips-General-Telugu

ఏబీ తన కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారట.విదేశీ సంస్థతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని, నాణ్యత లేని నిఘా పరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని.కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్థానం కల్పించలేదంటూ ప్రభుత్వం ఆరోపిస్తుంది.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు కీలక బాధ్యతలను నిర్వర్తించిన సంగతి తెలిసిందే.ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ చేశారు.

అయితే 2019 లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చాలా కాలం ఎలాంటి పోస్టింగ్ ను కల్పించలేదు.అయితే గతవారం ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం తో ఇదంతా కక్ష సాధింపు చర్యే అని ఏబీ అంటున్నారు.

మరోపక్క టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube