జెఫ్ బెజోస్ విలాసవంతమైన భవనం, విలువ రూ.1,150 కోట్లు: ప్రియురాలి కోసమే..!!

కొద్దిరోజుల క్రితం ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకుడు సమ్మర్‌లో సముద్రయానం చేసేందుకు గాను ఒక యాచ్ (విలాసవంతమైన నౌక)ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.రూ.4,600 కోట్ల విలువ చేసే ఆ నౌకలో సకల సౌకర్యాలు ఉన్నాయి.ఈ సంగతి తెలిసి ప్రపంచం నోరెళ్లబెట్టింది.

 Amazon Chief Executive Jeff Bezos Buys Beverly Hills Mansion For 165 Million Do-TeluguStop.com

బిల్‌గేట్స్ ఇలా చేస్తే నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ అమెజాన్ వ్యవస్ధాపకుడు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్ కూడా ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశాడు.

అమెరికా లాస్ ఏంజిల్స్‌‌ బెవర్లీ హిల్స్‌లో ఉన్న ఈ అత్యంత విలాసవంతమైన భవనం ధర అక్షరాల 165 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.1,150 కోట్లు).1930 ప్రాంతంలో హాలీవుడ్ మూవీ టైటాన్ జాక్ వార్నర్ కోసం నిర్మించిన ఈ భవనాన్ని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ 1992లో ఆర్కిట్ పాల్ స్టూడియో మొఘల్ ఎస్టేట్‌గా అభివర్ణించింది.పూర్తిగా జార్జియన్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవంతి ఆవరణలో భారీ గోల్ఫ్ కోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.1990 ప్రాంతంలో డేవిడ్ జెఫెన్ అనే వ్యక్తి రూ.280 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.దాదాపు 30 ఏళ్ల పాటు జెఫెన్ ఆధీనంలోనే ఉన్న ఈ భవనం ఇప్పుడు బెజోస్ యాజమాన్యం కిందకు వచ్చింది.

Telugu Amazon, Amazonexecutive, Beverly Hills, Executive, Jeff Bezos, Telugu Nri

గతంలో ప్రముఖ మీడియా సంస్థల అధినేత లాచ్లాన్ ముర్డోక్ 150 మిలియన్ డాలర్లు వెచ్చింది ఒక ఇంటిని కొనుగోలు చేశారు.ఇదే ఇప్పటి వరకు అమెరికాలో అత్యంత విలువైన డీల్.ఇప్పుడు వార్నర్ ఎస్టేట్ కొనుగోలుతో బెజోస్ ఆ రికార్డును బద్ధలు కొట్టాడు.అంతేకాదు లాస్ ఏంజిల్స్‌లో ఇదే అత్యంత ఖరీదైన ఇల్లుగా నిలిచింది.అయితే ఈ ఇంటిలోని ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Telugu Amazon, Amazonexecutive, Beverly Hills, Executive, Jeff Bezos, Telugu Nri

2019లో భార్య మెకంజీతో విడాకులు పొందిన అనంతరం గర్ల్‌ఫ్రెండ్ లౌరెన్ సాంచెజ్‌తో ఉల్లాసంగా గడుపుతున్న జెఫ్ బెజోస్‌ కొత్త జీవితాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.కొద్దిరోజుల క్రితం ఆర్టిస్ట్ ఎడ్ రుసా వర్క్‌ను క్రిస్టీ ఆక్షన్‌లో హర్టింగ్ ది వర్డ్ రేడియో కోసం 52.5 మిలియన్ డాలర్లు వెచ్చించారు.ఆ తర్వాత కెర్రీ జేమ్స్ మార్షల్ విగ్నెట్‌ 19ని ఏకంగా 18.5 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు.బెజోస్‌కు అమెరికాలోని పలు నగరాల్లో విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube