మూడేళ్ల తరువాత అహం బ్రహ్మాస్మి అంటోన్న మంచు హీరో

మంచు మనోజ్ గతకొంత కాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు.ఇటీవల తన పర్సనల్ జీవితంలో కూడా ఎదురుదెబ్బలు తగలడంతో ఆయన సినిమాలకు దూరం అయ్యాడు.

 Manchu Manoj New Movie Titled Aham Brahmasmi-TeluguStop.com

అయితే మళ్లీ సినిమాలతో బిజీ కావాలని చూస్తున్న మంచు మనోజ్ ప్రస్తుతం సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి, దానిపై తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

తన సొంత బ్యానర్‌కు సంబంధించిన అప్‌డేట్‌తో పాటు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేశాడు.

‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ టైటిల్ పోస్టర్ సూపర్‌గా ఉండటంతో నెటిజన్లు ఈ పోస్టర్‌ను తెగ షేర్ చేస్తున్నారు.శ్రీకాంత్ రెడ్డి అనే డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, మార్చి 6న ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Telugu Aham Brahmasmi, Manchu Manoj, Telugu-Movie

తన అన్న విష్ణు కూతుళ్ల పేర్లు వచ్చేలా ‘విద్యా నిర్వాణ మంచు ఆనంద్ క్రియేషన్స్’ అనే బ్యానర్‌ను ప్రారంభించి ఈ సినిమాను తానే ప్రొడ్యూస్ చేస్తున్నట్లు మంచు మనోజ్ తెలిపాడు.కాగా మూడేళ్ల తరువాత తాను సినిమాల్లోకి మళ్లీ వస్తున్నానంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube