విడ్డూరం : పదేళ్లలోపు అమ్మాయిలకు పెళ్లి చేయకుంటే ఆ ఊరులో వర్షాలు పడవట

అంతరిక్షంలో మనుషులు అడుగు పెడుతున్నారు, చంద్రుడిపై నివాసం ఏర్పాటు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇన్ని చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా మూడ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

 Child Marriage In The Name Of Tradition Blind Belief For Village-TeluguStop.com

మూడ నమ్మకాల్లో భాగంగా చిన్న పిల్లలకు పెళ్లిు చేయడం దారుణమైన విషయం.తాజాగా వెలుగులోకి వచ్చిన బాల్య వివాహాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఇండియా పరువు పోతుంది.

Telugu Child, Childrens, Gowda Lelibadi, Magadha Gowda, Odisha, Odishachildrens,

ఒడిశా రాయ్‌గఢ్‌ జిల్లా గౌడ లేలిబడి గ్రామంలో మగద గౌడ అనే తెగ ఉంది.ఆ తెగ వారు గ్రామలో దాదాపుగా 300 మంది ఉంటారు.ఆ గ్రామంలోని వారు ఈ తెగకు చెందిన ఆడ పిల్లలకు బాల్య వివాహాలు చేయకుంటే వర్షాలు పడవు అనే ఒక నమ్మకం ఉంది.అమ్మాయికి 10 ఏళ్లు దాటిన తర్వాత కూడా పెళ్లి చేయకుంటే గ్రామంలో వర్షాలు లేక కరువు వస్తుంది.

అందుకే అమ్మాయిలను అయిదు నుండి పదేళ్ల వయసులోనే పెళ్లిలకు సిద్దం చేస్తారు.

Telugu Child, Childrens, Gowda Lelibadi, Magadha Gowda, Odisha, Odishachildrens,

ఈ తెగకు చెందిన అమ్మాయిల పెళ్లిలను గ్రామస్తులు అంతా కలిసి చేస్తారు.ఆ రోజు ఊరంతా కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది.సంవత్సరంలో ఒక రోజు ఆ తెగకు చెందిన అమ్మాయిలు ఎవరు ఉంటే వారికి పెళ్లిలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

ఇటీవల కూడా ఆ తెగకు చెందిన ఎనిమిది మంది అమ్మాయిలకు పదేళ్ల లోపు వివాహం చేశారు.

Telugu Child, Childrens, Gowda Lelibadi, Magadha Gowda, Odisha, Odishachildrens,

వీరిని ఎడ్యుకేట్‌ చేసేందుకు ఎన్ని స్వచ్చంద సంస్థలు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా ఉంది.తమ ఊరు కరువుతో విలవిలలాడటం ఇష్టంలేక పిల్లల తల్లిదండ్రులు కూడా చిన్నతనంలోనే పెళ్లి చేసేందుకు ఒప్పుకుంటున్నారు.పదేళ్ల లోపు అమ్మాయిలను 20 ఏళ్ల కుర్రాళ్లు చేసుకోవడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు.

పోలీసు కేసులు నమోదు అవుతున్నా కూడా ఇక్కడ ఉన్న సాంప్రదాయం మాత్రం ఆగడం లేదు.వచ్చే ఏడాది అయినా ఈ బాల్య వివాహాలను ఆపుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube