ఇల్లు దానం చేసిన బాలు.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్‌ లెజెండరీ సింగర్ ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం మరోసారి వార్తల్లో నిలిచారు.

 Sp Balasubramaniam Donates Ancestral Home For Vedic School-TeluguStop.com

తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో పాటలు పాడి తనదైన ముద్రను వేసుకున్న బాలు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నారు.కాగా తాజాగా ఆయన తన పూర్వీకుల ఇల్లును విరాళంగా అందించి వార్తల్లో నిలిచారు.

నెల్లూరులో పుట్టిన బాలు, 1960లో మద్రాసుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.

నేపథ్య గాయకుడిగా తనదైన ముద్ర వేసుకుని కోట్లాది మనసుల్ని గెలుచుకున్నారు.

కాగా తన పూర్వీకుల ఆస్తిని ఆయన తాజాగా ఓ సదుద్దేశంతో కంచి మఠం వారికి విరాళంగా అందించారు.వేలం, అమ్మకం లాంటివి చేయకుండా తన ఆస్తిని మఠానికి విరాళంగా ఇవ్వడంతో బాలు అందరి మనసుల్ని గెలుచుకున్నారు.

ఆ ఇంటిలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా తాజాగా ఆయన ఆ ఇంటికి సంబంధించిన పత్రాలను కంచి ఆచార్య శ్రీవిజయేంద్ర సరస్వతికి అందజేశారు.

ఏదేమైనా తన ఆస్తిని ఇలా వేద పాఠశాల కోసం దానం చేయడంతో బాలు మరింత మంది అభిమానం పొందుతారని ఆయన అభిమానులు అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube