ఎన్టీఆర్‌ను చితక్కొట్టిన చరణ్.. పండగ చేసుకున్న జక్కన్న

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఇండస్ట్రీ జనం అప్పుడే అంచనాలు వేస్తు్న్నారు.

 Ram Charan To Fight Ntr In Rrr-TeluguStop.com

ఇక ఈ సినిమా రిలీజ్ కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా వీరిద్దరి పాత్రల్లో తారక్ పాత్ర హైలైట్ కానుందని, చరణ్ పాత్ర కాస్త తక్కువ ప్రాముఖ్యత ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తు్న్నాయి.దీంతో జక్కన్న ఈ సినిమాలో చరణ్ పాత్రకూ కూడా ప్రాముఖ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

తాజాగా వీరిద్దరి మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్లు, ఈ ఫైట్‌లో తారక్‌ను చరణ్ పొట్టుపొట్టు కొడతడాని తెలుస్తోంది.

దీంతో చరణ్ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తమ అభిమాన హీరో పాత్రకు ప్రాధాన్యత ఇచ్చేందుకు జక్కన్న తీసుకున్న ప్లాన్ బాగుందని వారు అంటున్నారు.అయితే ఈ ఫైట్ సీక్వెన్స్‌ ఎపిసోడ్‌ను ఏకంగా పది రోజులపాటు షూటింగ్ జరిపారట చిత్ర యూనిట్.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2021 జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube