వేరుశనగకాయల్లో 45 లక్షల విదేశీ కరెన్సీ... ఆశ్చర్యపోయిన కస్టమ్స్ అధికారులు

ఈ మధ్య కాలంలో దళారులు వజ్రాలను, బంగారాన్ని, విదేశీ కరెన్సీని తరలించటానికి ఎంచుకుంటున్న మార్గాలు కస్టమ్స్ అధికారులనే షాక్ కు గురి చేస్తున్నాయి.తాజాగా ఢిల్లీ విమానశ్రయంలో 45 లక్షల రూపాయల విలువ గల విదేశీ కరెన్సీని ఒక వ్యక్తి వేరుశనగకాయల్లో తీసుకొనిరావడంతో అక్రమంగా కరెన్సీని తీసుకొచ్చిన తీరును చూసి షాక్ అవ్వడం కస్టమ్స్ అధికారుల వంతయింది.

 Delhi Customs Officer Seized 45 Lakh Rupees Foreign Currency In Groundnut-TeluguStop.com

పూర్తి వివరాలలోకి వెళితే ఢిల్లీ విమానశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది చేసిన తనిఖీలలో మురద్ అలం అనే పేరు ఉన్న వ్యక్తి అక్రమంగా విదేశీ కరెన్సీని తీసుకొనిరావటాన్ని గుర్తించారు.వేరుశనగ కాయల్లో వేరుశనగ గింజలను తీసేసి దారంతో విదేశీ కరెన్సీ నోట్లను చుట్టి తీసుకొనివచ్చిన మురద్ అలం కొంచెం అనుమానాస్పదంగా కనిపించటంతో సిబ్బంది క్షుణ్ణంగా అతనిని తనిఖీ చేశారు.

దుబాయ్ నుండి ఢిల్లీకి అక్రమంగా విదేశీ కరెన్సీని తీసుకొనివస్తూ మురద్ అలం పట్టుబట్టాడు.వేరుశనగ కాయల ద్వారా కరెన్సీను తరలిస్తూ ఉండటం చూసి కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు.

ట్విట్టర్ లో అధికారులు దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.కస్టమ్స్ అధికారులు మురద్ అలంను అదుపులోకి తీసుకొని అక్రమ విదేశీ కరెన్సీ గురించి విచారణ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube