మోదీతో జగన్ చర్చలు : కేంద్ర మంత్రివర్గంలో చేరబోతున్న వైసిపి ?

వైసీపీ బీజేపీ కొద్ది రోజులుగా సన్నిహితంగా మెలుగుతున్నాయి.జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బిజెపి సమర్థిస్తున్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది.

 Jagan Mohan Reddy Meet In Narendra Modi Today-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పరోక్షంగా బిజెపి సహకరించిన విషయం బహిరంగమే.తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలలో వైసీపీని శత్రువులు గానే బీజేపీ భావించి ఇబ్బందులు సృష్టిస్తూ వచ్చింది.

దీనికి తగినట్లుగా ఏపీ బీజేపీ నేతలు కూడా వైసీపీ ప్రభుత్వం పై టిడిపి, జనసేన తో కలిసి విమర్శలు చేస్తూ వచ్చారు.దీంతో ఇక కేంద్రంతో జగన్ కు చెడిందని, జగన్ కేసులు మళ్లీ తిరిగి తోడుతున్నారని, ఆయన జైలుకు కూడా వెళ్తారనే ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి.

Telugu Jagan, Jagan Modi, Jagan Ap Cm, Jagan Latest, Jaganmohan, Ycp Bjp, Ycp Ap

కానీ కొద్ది రోజులుగా బీజేపీ వైఖరి స్పష్టం గా మారింది.వైసీపీతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లుగా వ్యవహరిస్తు వస్తోంది.ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చేలా వెలువడడంతో, ప్రాంతీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ తమ రాజకీయ నిర్ణయాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా బలమైన పార్టీగా వైసీపీ ఏపీలో ఉండడంతో పాటు 22 మంది ఎంపీలు, అలాగే రాజ్యసభలోనూ వైసీపీకి మరిన్ని స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యసభలో పెండింగ్ లో పడకుండా ఉండాలంటే కొన్ని కొన్ని ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగానే కేంద్ర మంత్రివర్గంలో వైసీపీకి స్థానం కల్పించాలని, ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

Telugu Jagan, Jagan Modi, Jagan Ap Cm, Jagan Latest, Jaganmohan, Ycp Bjp, Ycp Ap

ఈ మేరకు ఈరోజు జగన్ తో భేటీ సందర్భంగా దానికి సంబంధించిన విషయాలపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.ఇక జగన్ కూడా కేంద్ర మంత్రి వర్గంలో చేరే విషయంలో సముఖంగానే ఉన్నట్లు సమాచారం.కేంద్ర మంత్రివర్గంలో చేరితే ఏపీకి నిధుల విషయంలోనూ, రాజకీయంగా తీసుకునే నిర్ణయాలకు కేంద్రం సపోర్ట్ ఉంటుందని, అదే సమయంలో బీజేపీతో కలిసి ఏపీలో టీడీపీని మరింతగా అణగదొక్కవచ్చనే అభిప్రాయంతో బీజేపీ, వైసీపీ ఉన్నాయి.

వైసీపీకి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఒకటి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube