కరోనా‌కు బెంబేలు: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నుంచి వైదొలగిన సోనీ, ఇంటెల్

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చైనాలో వెయ్యి మంది మరణించగా… ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది దీని బారినపడి ఐసోలేటేడ్ వార్డుల్లో ఉన్నారు.కేవలం ఆరోగ్య రంగంతో పాటు వర్తక, వాణిజ్యాలపైనా కరోనా ప్రభావం చూపిస్తోంది.

 Sony Intel Pull Out Of Mobile World Congress In Barcelona-TeluguStop.com

వ్యాధి సోకుతుందేమోనని భావించి చేపలు, రోయ్యలు ఇతర మత్స్య ఉత్పత్తులు, మాంసాహారంపై అనధికార నిషేధం కొనసాగుతోంది.ఇక వాణిజ్యం విషయానికి వస్తే.

వ్యాపారవేత్తలు ఆయా దేశాలకు పర్యటనలు వాయిదా వేసుకోగా, విమాన, నౌకాయాన సిబ్బంది ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతున్నారు.

తాజాగా కరోనా భయంతో బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) నుంచి జపాన్ వైర్‌లెస్ క్యారియర్ ఎన్‌టీటీ డోకోమో, సోనీ కార్ప్‌తో పాటు కాలిఫోర్నియాకు చెందిన చిప్ దిగ్గజం ఇంటెల్ కార్ప్‌ ఈ ప్రతిష్టాత్మక సదస్సు నుంచి వైదొలిగాయి.

ఇప్పటికే అమెజాన్, దక్షిణకొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్, స్వీడిష్ దిగ్గజం ఎరిక్సన్, యూఎస్ చిప్ మేకర్ ఎన్విడియా ఎమ్‌డబ్ల్యూసి నుంచి వైదొలిగాయి.కాగా 2019లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు 1,00,000 మంది సందర్శకులు, 2,400 ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 24- 27 తేదీలలో బార్సిలోనా వేదికగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ జరగనుంది.

Telugu Congress, Corona, Corona Fears, Intelcongress, Sony, Telugu Nri-

ఇది టెలికాం, ఎలక్ట్రానిక్ పరిశ్రమ యొక్క అతిపెద్ద వార్షిక సదస్సు.కంపెనీలు తమ విక్రయాలు పెంచుకునేందుకు స్టాండ్‌లు ఏర్పాటు చేసుకోవడానికి, ఆతిథ్యం కోసం లక్షలు ఖర్చు చేస్తాయి.దీని కారణంగా బార్సిలోనా ఆర్ధిక వ్యవస్ధ గతేడాది 470 మిలియన్ యూరోలు (515 మిలియన్ డాలర్లు) పెరిగినట్లుగా నిపుణులు అంచనా.

అయితే ఈ సదస్సు నుంచి కంపెనీలు వైదొలిగితే ఆ ఖర్చును వారే భరించాల్సి ఉంటుందని ఎగ్జిబిటర్లకు సన్నిహిత వర్గాలు తెలిపాయి.ఒకవేళ 750కి పైగా ఆపరేటర్లు, 400 కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న పరిశ్రమల సంఘం జీఎస్ఎంఏ కనుక తానంతట తానుగా ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ నుంచి తప్పుకుంటే ఈ అసోసియేషనే బాధ్యత వహిస్తుంది.

దీనిపై సోనీ, ఎన్టీటీ స్పందిస్తూ.వినియోగదారులు, భాగస్వాములు, సిబ్బంది భద్రతను పరిగణనలోకి తీసుకునే తాము ఈ సదస్సు నుంచి తప్పుకుంటున్నట్లు రెండు కంపెనీలు ప్రకటించాయి.

అలాగే తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కజుహిరో యోషిజావా ప్యానెల్ స్పీకర్‌గా వ్యవహరిస్తారా లేదా అన్న దానిపై ఎన్టీటీ స్పష్టత ఇవ్వలేదు.మరోవైపు తాము ప్రెస్ ఈవెంట్‌ను మాత్రం రద్దు చేస్తున్నామని.

కానీ ఎమ్‌డబ్ల్యూసీకి హాజరై, కొత్త పరికరాలను ప్రదర్శిస్తామని చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం టీసీఎల్ తెలిపింది.

అయితే నార్వేకు చెందిన టెలినార్‌ మాత్రం తాము సదస్సుకు హాజరవ్వడంలో సందేహం లేదని, కానీ సిబ్బంది సంఖ్యను తగ్గిస్తామని ప్రకటించింది.

మరోవైపు కరోనా వెలుగులోకి వచ్చిన చైనాలోని హుబీ ప్రావిన్స్ నుంచి ఎవరూ కాంగ్రెస్‌కు హాజరుకావొద్దంటూ జీఎస్ఎంఏ ఆదివారం విజ్ఞప్తి చేసింది.ఒకవేళ చైనీయులెవరైనా ఈ కార్యక్రమానికి కనీసం రెండు వారాలు చైనాకు వెలుపల ఉన్నట్లు నిరూపించుకోవాలని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube