కరోనా : ఇండియాలోని చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరిపై దీని ప్రభావం

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంది.చైనాలో ఇప్పటికే వెయ్యి మందికి పైగా చనిపోగా, 50 వేల మందికి పైగా కరోనా బాధితులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

 Carona Virus Effects On Indian Economy Very Huge-TeluguStop.com

కరోనాను చైనా నుండి తమ దేశాల్లోకి రాకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు ఆయా దేశాలు చేస్తున్నాయి.ముఖ్యంగా ఇండియా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రయత్నాలు చేస్తుంది.

కరోనాను అయితే వ్యాప్తి చెందకుండా చూస్తున్న ప్రభుత్వం దాని వల్ల వస్తున్న నష్టంను మరియు ఆర్థిక ఇబ్బందులను మాత్రం అడ్డుకోలేక పోతుంది.

ఇండియాకు ఆటో మొబైల్‌ ఉత్పత్తుల నుండి పిల్లల బొమ్మల వరకు ఎన్నో వేల కోట్ల ఉత్పత్తులు చైనా నుండి వస్తాయి.

మనం ఏ వస్తువు తీసుకున్నా దానిపై ఎక్కువగా మేడ్‌ ఇన్‌ చైనా అని ఉంటుంది.ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా మార్కెట్‌ ఉన్న ఫోన్‌లలో 80 శాతం ఫోన్‌లు చైనాలో తయారు అవుతున్న విషయం తెల్సిందే.

కంప్యూటర్లు, కార్లకు సంబంధించిన స్పేర్‌ పార్ట్స్‌, ఇంకా పిల్లల టాయ్స్‌ అనేక రకాల వస్తువులను మనం చైనా నుండి దిగుమతి చేసుకుంటాం.

ఇప్పుడు చైనాలో పరిస్థితి దారుణంగా ఉన్న కారణంగా గత మూడు వారాలుగా దిగుమతి అనేది పూర్తిగా ఆగిపోయింది.

అక్కడ ఉత్పత్తి నిలిచి పోవడంతో పాటు, దిగుమతికి ఇండియన్‌ వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు.కనుక చైనా నుండి రావాల్సిన దాదాపు అన్ని కూడా ఆగిపోయాయి.

ఇక ఇండియాలో రైతులు పండిరచే పంటను చైనాకు ఎగుమతి చేస్తూ ఉంటారు.ముఖ్యంగా మిర్చిని చైనాకు ఎగుమతి చేయడం వల్ల రైతులు మంచి లాభాలు పొందుతున్నారు.

Telugu Auto Mobiles, Carona, Caronaeffects, Cars, China, Computers, Farmers, Ind

ఇండియాలో పండే తేజ రకం మిర్చికి చైనాలో మంచి డిమాండ్‌ ఉంది.దాంతో ఈ సంవత్సరం తేజ మిర్చి ఏకంగా 25 వేల రేటుకు అమ్ముడు పోయింది.చైనాకు భారీ స్థాయిలో తేజ మిర్చిని ఎగుమతి చేయడం జరిగింది.కాని కరోనా వైరస్‌ కారణంగా చైనా తేజ మిర్చి దిగుమతి ఆపేసింది.దాంతో తేజ మిర్చిని కొనే వారే కరువయ్యారు.25 వేలు ఉన్న రేటు కనీసం 10 వేలు కూడా లేకుండా అయ్యింది.కరోనా వైరస్‌ కారణంగా రైతులకు చాలా పెద్ద దెబ్బ పడిరది.పత్తి రైతులకు కూడా కరోనా దెబ్బ గట్టిగా పడిరది.

Telugu Auto Mobiles, Carona, Caronaeffects, Cars, China, Computers, Farmers, Ind

మనం ఎగుమతు చేసే వాటి ధరలు దారుణంగా పడిపోవడంతో పాటు చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు అత్యధికంగా పెరుగబోతున్నాయి.ఉదాహరణకు ఒక స్మార్ట్‌ ఫోన్‌ 10 వేల రూపాయలకు నెల రోజుల క్రితం వచ్చింది అంటే అది వచ్చే నెల నుండి 15 వేల రూపాయలకు పెరగబోతుంది.చైనా కరోనా ప్రభావం మొత్తం మళ్లీ మనమీదే చూపించబోతున్నారు.ఇలా కరోనా సామాన్యులను కూడా చిదిమేయబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube