లంచ్‌కి పిలిచి ఎన్ఆర్ఐపై లాయర్ అత్యాచారం, వీడియో తీసిన భార్య: 50 లక్షలు వసూలు

న్యాయం పక్షాన నిలవాల్సిన న్యాయవాది అతను.ఫేస్‌బుక్‌లో పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ ప్రవాస భారతీయులపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 Three Arrested For Raping Nri Woman In Hyderabad-TeluguStop.com

భర్త కష్టసుఖాల్లో తోడుగా నిలవాల్సిన భార్య ఈ తతంగాన్ని వీడియో తీసి అతనికి సహకరించింది.
ఎన్ఆర్ఐ మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆమె నగ్న దృశ్యాలతో బ్లాక్ మెయిల్ చేసి సుమారు రూ.50 లక్షలు దండుకున్న ముగ్గురిని హైదరాబాద్ బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన మామిడి సంజీవరెడ్డి (52) లాయర్‌గా పనిచేస్తున్నాడు.

ఆమె భార్య కావేరీ (45) వీరు హైదరాబాద్ నిజాంపేటలోని బాచుపల్లిలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు.ఈ క్రమంలో కోకాపేటకు చెందిన ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన ఓ మహిళ సంజీవరెడ్డికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది.

అప్పటి నుంచి వీరిద్దరూ ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ చేసుకునేవారు.ఇది అక్కడి నుంచి ఫోన్‌లో మాట్లాడుకునే వరకు వెళ్లింది.

ఈ క్రమంలో 2018 అక్టోబర్ 31న ఎన్ఆర్ఐ మహిళ అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది.ఆమె రాక గురించి ముందే సమాచారం వుండటంతో సంజీవరెడ్డి బాధితురాలిని రిసీవ్ చేసుకుని ఆమె సోదరి ఇంట్లో వదిలిపెట్టాడు.

నవంబర్ 2న తమతో పాటు లంచ్‌కు రావాలని ఎన్ఆర్ఐని సంజీవరెడ్డి కోరగా దీనికి అంగీకరించిన ఆమె కూకట్‌పల్లిలోని సితార హోటల్‌కు వచ్చింది.అక్కడ తన భార్య కావేరీ, మేనల్లుడు విశాల్ రెడ్డిలను సంజీవరెడ్డి ఆమెకు పరిచయం చేశాడు.

అయితే ఎన్ఆర్ఐ మహిళ లంచ్‌ను నిరాకరించడంతో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించారు.ఆమె స్పృహతప్పి పడిపోవడంతో కారులో ఎక్కించుకుని బాచుపల్లిలో వారు అద్దెకు ఉంటున్న ఇంట్లోకి తీసుకొచ్చారు.

Telugu Nri, Telugu Nri, Nri Hyderabad-Telugu NRI

అనంతరం సంజీవరెడ్డి ఆమెపై అత్యాచారం చేశాడు.ఈ దృశ్యాలను అతని భార్య కావేరి ఫోటోలు, వీడియోలు తీసింది.వాటి సాయంతో సంజీవరెడ్డి ఎన్ఆర్ఐ మహిళను బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ వచ్చారు.తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని లేనిపక్షంలో తాము తీసిన అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

దీంతో భయపడిన ఆమె వద్దనుంచి ఏడాదిన్నర కాలంగా 30 తులాల బంగారు ఆభరణాలు, 6 వేల అమెరికన్ డాలర్లతో పాటు పలు బ్యాంకుల చెక్కులను లాక్కున్నారు.

అలా అంతా కలిపి సుమారు రూ.50 లక్షలు దండుకున్నారు.వీరి వేధింపులు రాను రాను ఎక్కువ అవుతుండటంతో సహనం నశించిన ఎన్ఆర్ఐ మహిళ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంజీవరెడ్డి, కావేరి, విశాల్ రెడ్డిలను బీదర్‌లోని వారి నివాసంలో అరెస్ట్ చేసి, అశ్లీల ఫోటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube