హమయ్య : కరోనా కంగారు తగ్గినట్లే, ఆమె ఇందుకు సాక్ష్యం

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ ఒక్కసారి సోకింది అంటే ఖచ్చితంగా మృత్యువు ఒడిలోకి వెళ్లినట్లే అనుకుంటున్నారు.చైనాలో ఇప్పటి వరకు దాదాపుగా వెయ్యి మందికి పైగా చనిపోయారంటూ అధికారికంగా వార్తలు వస్తున్నాయి.

 Corona Virus Woman Patient Recovered Fully In China-TeluguStop.com

అయితే అంతకు మించే ఉండవచ్చు అనేది కొందరి మాట.అంతగా కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా చైనాకు చెందిన ఒక మహిళకు కరోనా వైరస్‌ను పూర్తిగా తగ్గించారు.ఆమెకు సరైన చికిత్స అందించడంతో పాటై కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పని చేసే మందులను రెగ్యులర్‌గా ఇవ్వడంతో ఆమె పూర్తిగా కరోనా రహిత మహిళ అయ్యింది.

ఈమద్య కాలంలో ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌కు చైనా మందు కనిపెట్టింది అంటూ వార్తలు వచ్చాయి.

కాని అది నిజం కాకపోవచ్చు అనుకున్నారు.తాజాగా ఆ మహిళ కరోనా నుండి పూర్తిగా విముక్తి పొందిన నేపథ్యంలో నిజంగానే కరోనాకు మందు తయారు అయ్యిందని నిరూపితం అయ్యింది.

చైనాలో ప్రస్తుతం పాతిక వే మంది వరకు కూడా కరోనా బాధితులు ఉన్నారు.వారంతా కూడా ఈ కరోనా వైరస్‌ నుండి బయట పడతారనే నమ్మకం కుటుంబ సభ్యుల్లో వ్యక్తం అవుతుంది.

Telugu China, Corona, Coronarecovered, Recovered-Latest News - Telugu

అయితే ఒక్కసారి కరోనా వైరస్‌ లక్షణాలు బయట పడితే కనీసం మూడు వారాల పాటు పూర్తిగా డాక్టర్ల పరిరక్షణలో కఠినమైన ట్రీట్‌మెంట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.అలా తీసుకున్న సమయంలోనే కరోనా వైరస్‌ అనేది ప్రాణాలను తీయకుండా ఉంటుందని ఇటీవల ఏ మహిళ అయితే కరోనా నుండి బయట పడిరదో ఆ మహిళకు ట్రీట్‌ మెంట్‌ చేసిన వైధ్యులు అంటున్నారు.

ఇక్కడ చిత్రమేంటీ అంటే కరోనా నుండి బయట పడ్డ ఆ మహిళను జనాలు దగ్గరకు రానివ్వడం లేదు.కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆమెతో గతంలో మాదిరిగా సన్నిహితంగా ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ చైనా మీడియాలో ఒక కథనం వచ్చింది.

ఆమెలో ఇంకా ఏమైనా కరోనా వైరస్‌ ఉందేమో అనే అనుమానాలు అంతా వ్యక్తం చేస్తూ ఆమెకు దూరంగా ఉంటున్నారు.పాపం ఆమె కరోనా నుండి విముక్తి పొందినా కూడా జనాల దృష్టిలో మాత్రం కరోనా బాధితురాలిగానే మిగిలి పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube