భార్య కళ్ళలో కారం కొట్టిన శాడిస్టు భర్త..!

అబ్బబ.ఈ మగాళ్లు మృగాళ్ళుగా మారిపోయి చాలా కాలం అయ్యింది.ఎప్పుడు ఏ ఆడపిల్లతో అమానుషంగా ప్రవర్తిస్తారో చెప్పలేని పరిస్థితి.ప్రేమిస్తారు.ప్రేమించిన కొద్దికాలానికే అనుమానిస్తారు.ఇంకా పెళ్లి చేసుకుంటే చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు శాడిస్టు భర్తలు.

 Psycho Husband Throws Chilli Powder Into Wife Eyes-TeluguStop.com

ఈ తరహాలోనే ఓ శాడిస్టు భర్త తన శాడిజాన్ని చూపించాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.షార్జాలో భార్య అనుకోకుండా చిన్న తప్పు చేసింది.అంతే ఆ భర్త ఆమె కళ్లల్లో కారం కొట్టాడు.

అంత తప్పు ఏంటి అనుకుంటున్నారా? పని తొందరలో అనుకోకుండా అన్నంలో ఉప్పుకు బదులు చక్కెర వేసింది.

Telugu Chilli Powder, Psycho, Psychothrows-

అదే పెద్ద తప్పు అయ్యింది ఆ నీచుడికి.ఆహారంలో విషం పెట్టి నన్ను చంపేయాలని చూస్తావా? అంటూ భార్య రెండు కళ్లను కారంతో నింపేశాడు ఆ శాడిస్ట్ భర్త.దీంతో బాధితురాలికి ఒక కంటిచూపు పోయింది.

కళ్ళలో కారం కొట్టడమే కాదు చేతలతో హిమిసించాడు కూడా.ఈ కేసు తాజాగా షార్జా కోర్టులో విచారణకు వచ్చింది.

అయితే ఆ విచారణలో ఆమె మాట్లాడుతూ.పెళ్ళై 12 ఏళ్ళు అయ్యింది అని.పెళ్లి జరిగిన సమయం నుండి భర్త అనుమానంతో ఆమెను తీవ్రంగా హింసిస్తున్నాడు అని.ఇప్పుడు చిన్న తప్పుకు ఇలా కళ్ళలో కారం కొట్టి కంటి చూపు పోగొట్టాడని ఆమె వాపోయింది.అయితే ప్రస్తుతం ఈ కేసు షార్జా కోర్టులో విచారణలో ఉంది.మరి విచారణాంతరం భర్తకు ఏలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube