వైసిపి టిడిపి మధ్య లో ఇరుక్కుపోయిన బిజెపి ?

ఏపీలో నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ వ్యవహారాలు చేస్తూ వస్తున్న టిడిపి వైసిపి మధ్య ఇప్పుడు కొత్తగా బిజెపి వచ్చి చేరింది.మొన్నటి వరకు వైసిపి ప్రభుత్వానికి బీజేపీ వ్యతిరేకి అనే విధంగా నిర్వహించినా ఇప్పుడు మాత్రం వైసిపి కి అనుకూలంగా ఆ పార్టీ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం, ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు.

 Telugu News Political-TeluguStop.com

మిగతా బీజేపీ నాయకుల వ్యవహారం ఎలా ఉన్నా జగన్ కు అనుకూలంగా తన గొంతు పెంచి మాట్లాడుతున్న వారిలో బిజెపి నాయకులు జీవీఎల్ నరసింహారావు ఎక్కువగా కనిపిస్తున్నారు.

మూడు రాజధాని అంశం శాసన మండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉంటుందని రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర పరిధిలోని అంశం అంటూ పదే పదే టిడిపికి మండేలా నరసింహారావు మాట్లాడుతున్నారు.

మొదటి నుంచి టిడిపి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న జీవీఎల్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో అప్పటి టిడిపి ప్రభుత్వం పై అనేక విమర్శలు చేస్తూ వచ్చారు.అలాగే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి మరి జీవీఎల్ శుభాకాంక్షలు చెప్పారు.

Telugu Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Ys Jagan-Telugu Political Ne

ఇక ఏపీ బీజేపీ లో ఒక వర్గం టీడీపీ కి మద్దతుగా వ్యవహరిస్తుంటే మరో వర్గం మాత్రం అటుఇటుగా వ్యవహారాలను చక్కబెడుతోంది.కానీ జీవీఎల్ వంటి నాయకులు మాత్రం మొదటి నుంచి వైసిపి కి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.దీంతో ఇప్పుడు టిడిపి జీవీఎల్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తోంది.ఈ మేరకు టిడిపి సీనియర్ నాయకుడు వర్ల రామయ్య జీవీఎల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా ఆయనకు సవాల్ విసురుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో వైసిపి టిడిపి మధ్య జరుగుతున్న యుద్ధంలో కి ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చి చేరడం పూర్తి స్థాయిలో జగన్ కు మద్దతుగా బిజెపి వ్యవహరిస్తుండడం టీడీపీ తో పాటు కొత్తగా బీజేపీతో పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సైతం తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube