అల వైకుంఠపురములో 26 రోజుల కలెక్షన్లు.. టార్గెట్ 160!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో బన్నీ ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

 Ala Vaikuntapuramulo 26 Days Worldwide Collections-TeluguStop.com

ఈ సినిమాతో బన్నీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు.

కాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా, కలెక్షన్ల పరంగానూ అదిరిపోయే సక్సెస్‌ను సాధించింది.

ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు.ఈ సినిమా రిలీజ్ అయ్యి 26 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.156 కోట్లకు పైగా కలెక్ట్ చేసి దూసుకుపోతుంది.సంక్రాంతి చిత్రాల తరువాత పెద్ద చిత్రాలు ఏమీ రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 26 రోజుల్లో రూ.156.62 కోట్లు కొల్లగొట్టి తన సత్తా చాటింది.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.

కాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 43.40 కోట్లు

సీడెడ్ – 17.96 కోట్లు

గుంటూరు – 10.89 కోట్లు

ఉత్తరాంధ్ర – 19.40 కోట్లు

ఈస్ట్ – 11.16 కోట్లు

వెస్ట్ – 8.76 కోట్లు

కృష్ణా – 10.51 కోట్లు

నెల్లూరు – 4.56 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 126.64 కోట్లు

కర్ణాటక – 9.13 కోట్లు

కేరళ – 1.17 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.44 కోట్లు

ఓవర్సీస్ – 18.24 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 156.62 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube