సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సమంత?

టాలీవుడ్‌ స్టార్ బ్యూటీ సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.పెళ్లయిన తరువాత కూడా సమంత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తన హవా కొనసాగిస్తోంది.

 Samantha Ready As Housewife-TeluguStop.com

ఇటీవల ఆమె చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.తాజాగా సమంత నటించిన జాను సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

కాగా సమంత త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనుందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత దీని గురించి ప్రస్తావించింది.

మరో రెండు మూడేళ్ల వరకు మాత్రమే ఆమె సినిమాల్లో నటించే అవకాశం ఉందని, పెళ్లయిన వ్యక్తిగా ఆమె తన కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని చూస్తోందట.తన భర్తను చూసుకోవడంతో పాటు, తల్లిగా కూడా మారాలని సమంత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి హీరోయిన్ కూడా తన చరిష్మాను ఏదో ఒక సమయంలో వదులుకుంటోంది.ఈ లెక్కన సమంత కూడా తన క్రేజ్ తగ్గక ముందే రిటైర్ అవుదామని ఆలోచిస్తుంది.

మొత్తానికి సమంత రిటైర్‌మెంట్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా సమంత నటించిన జాను సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘96’కు రీమేక్‌గా ఈ చిత్రం వస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube